Singer Palak Muchhal Marriage With Mithoon Sharma, Wedding Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Palak Muchhal Marriage: మ్యూజిక్‌ డైరెక్టర్‌ను పెళ్లాడిన ప్రముఖ సింగర్‌.. ఫోటోలు వైరల్‌

Nov 7 2022 4:23 PM | Updated on Nov 7 2022 4:54 PM

Singer Palak Muchhal Marries Mithoon Sharma See Wedding Pics - Sakshi

బాలీవుడ్‌ సింగర్‌ పాలక్‌ ముచ్చల్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మిథూన్‌ శర్మ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రెడ్‌ కలర్‌ లెహంగాలో పాలక్‌ మెరిసిపోతుండగా, మిథూన్‌ శర్మ గోధుమ రంగు షేర్వానీలో కనిపించారు.

ఎల్లప్పుడూ కలిసి ఉండాలని మేమిద్దరం ఇలా ఒక్కటయ్యం అంటూ పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. దీంతో కొత్త జంటకు పలువురు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

సోనూ నిగమ్, కైలాష్ ఖేర్, కృషికా లుల్లా, రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా వంటి పలువురు సెలబ్రిటీలు వీరి రిసెప్షన్‌కు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా పాలక్‌ ఏక్‌ థా టైగర్‌’ ‘అషికీ–2’ ‘యం.ఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ వంటి సినిమాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement