ఓటీటీలో తాప్సీ హిట్‌ సినిమా సీక్వెల్‌ రెడీ | Phir Aayi Haseen Dillruba OTT Release Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో తాప్సీ హిట్‌ సినిమా సీక్వెల్‌ రెడీ

Jul 15 2024 1:08 PM | Updated on Jul 15 2024 1:21 PM

Phir Aayi Haseen Dillruba OTT Release Date Locked

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హసీన్‌ దిల్‌రుబా’. మర్డర్‌ మిస్టరీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం 2021లో విడుదలైంది. వినీల్‌ మాథ్యూ తెరకెక్కించిన  ఈ చిత్రం ప్రేక్షకుల్ని సస్పెన్స్‌కి గురి చేయడమే కాకుండా బాక్సాఫీసు దగ్గర సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సీక్వెల్‌గా  ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ పేరుతో మళ్లీ వచ్చేస్తుంది. ఈ క్రమంలో విడుదల తేదీని కూడా మేకర్స్‌ తాజాగా ప్రకటించారు.

‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ సీక్వెల్‌ను జయ్‌ప్రద్‌ దేశాయ్‌ దర్శకత్వం వహించారు. కనికా థిల్లాన్‌ నిర్మాత. ఇందులో విక్రాంత్‌ మాస్సే, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. మర్డర్‌ మిస్టరీ, సైకలాజికల్‌ థ్రిల్లర్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 9న డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుందని మేకర్స్‌ ప్రకటించారు.

నిర్మాత కనికా ధిల్లాన్ మాట్లాడుతూ తాప్సీ పన్ను చాలా అద్భుతంగా ఈ చిత్రంలో నటించారని తెలిపింది. పార్ట్‌ 1 కంటే సీక్వెల్‌లో ఆమె అందరినీ ఆకట్టుకునేలా మెప్పించారని చెప్పారు. మరో ప్రధాన పాత్రలో నటించిన విక్రాంత్‌మాస్సే  గురించి కూడా ఆమె మాట్లాడింది. ఆయనలోని ప్రతిభ ఈ సినిమాతో మరింతగా ప్రకాశిస్తుందని కనికా చెప్పింది. మీర్జాపూర్‌లో బబ్లూ పండిట్‌ పాత్రలో కనిపించిన విక్రాంత్‌ తెలుగువారికి పరిచయం అయ్యాడు. '12th ఫెయిల్‌' సినిమాతో మరింత పాపులర్‌ అయ్యాడు. 

Advertisement
 
Advertisement
Advertisement