
బీసీ సంఘం నేత ఆరోపణలు
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా (Hari Hara Veeramallu)కు చిక్కులు తప్పేలా లేవు. ఈ మూవీ పూర్తి కల్పితమని, ప్రజావీరుడు పండగ సాయన్న జీవిత చరిత్రను తీసుకుని చరిత్రలో ఎక్కడాలేని కల్పిత పాత్రలతో ఈ సినిమా తీస్తున్నారని బీసీ సంఘం నాయకుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి డాక్టర్ శివ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చరిత్రను వక్రీకరించే ఈ సినిమాను అడ్డుకుంటామని, త్వరలో ఈ చిత్రంపై హైకోర్టులో పిల్ వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పండగ సాయన్న జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీశారని తాము ఆరోపించగా చిత్రయూనిట్ తప్పును సమర్థించుకుకోవాలని చూసింది. ఇది పండగ సాయన్న మూవీ కాదని, 1336లో విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర బుక్కరాయలు కథ అని చెప్పారు.
కానీ, సినిమా ట్రైలర్‌లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. డబ్బుల కోసం చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తప్పకుండా అడ్డుకుంటాం. త్వరలోనే హైకోర్టును ఆశ్రయిస్తాం అని శివ తెలిపారు. హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే.. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ జూలై 24న విడుదల కానుంది.
చదవండి:విశ్వంభర డేట్ ఫిక్స్?