
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కావాల్సింది... కానీ కుదర్లేదు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేశామని అప్పట్లో ఈ చిత్రం యూనిట్ పేర్కొంది.
ఆ సంగతి అలా ఉంచితే, తాజాగా ఈ సినిమాను సెప్టెంబరు 18న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక ‘విశ్వంభర’కి సంబంధించి ఓ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించాల్సి ఉంది. ఈ పాటలో చిరంజీవితో పాటు బాలీవుడ్ నటి మౌనీ రాయ్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ‘అన్నయ్య’ సినిమాలోని పాపులర్ పాట ‘ఆట కావాలా పాట కావాలా...’కి రీమిక్స్‌గా ఈ పాట ఉంటుందని సమాచారం.
ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్రిష హీరోయిన్‌గా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.