రూ. 25 కోట్ల ఎఫెక్ట్‌.. అక్షయ్ సినిమాపై మనసు మార్చుకున్న 'పరేష్‌ రావల్‌' | Paresh Rawal returns to Hera Pheri 3 Because This Reason | Sakshi
Sakshi News home page

రూ. 25 కోట్ల ఎఫెక్ట్‌.. అక్షయ్ సినిమాపై మనసు మార్చుకున్న 'పరేష్‌ రావల్‌'

Jun 30 2025 11:16 AM | Updated on Jun 30 2025 11:22 AM

Paresh Rawal returns to Hera Pheri 3 Because This Reason

బాలీవుడ్‌లో వినోదాలు పంచిన సిరీస్‌ల్లో ‘హెరాఫెరీ’ (Hera Pheri) ఒకటి. గత కొన్ని నెలలుగా ‘హెరాఫెరీ 3’ మూవీ సీక్వెల్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సుమారు 20 ఏళ్ల తర్వాత  పార్ట్‌-3 ప్లాన్‌ చేశారు.  అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్, టబు, ఓం పురి, గుల్షన్ గ్రోవర్ వంటి స్టార్స్‌ ఈ సిరీస్‌లలో నటించారు. అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ ప్రస్తుత సీక్వెల్‌ను నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, సడెన్‌గా ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రముఖ నటుడు  పరేష్‌ రావల్‌ (శంకర్‌ దాదా ఎంబిబిఎస్‌ ఫేం) కొద్దిరోజుల ‍క్రితం ప్రకటించారు. కామెడీ ప్రధాన కాన్సెప్ట్‌తో వచ్చిన గత రెండు సిరీస్‌లో ఆయన పాత్ర చాలా కీలకం. కానీ, పార్ట్‌-3 నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు చెప్పడంతో సినిమాపై అంచనాలు అన్నీ తారుమారు అయిపోయాయి. దీంతో అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ రంగంలోకి దిగింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వారు చర్యలు ప్రారంభించారు. దీంతో పరేష్‌ రావల్‌ దిగొచ్చినట్లు తెలుస్తోంది. హెరాఫెరీ-3లో తాను నటిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.

'హేరా ఫేరి 3' సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నెల రోజుల తర్వాత తిరిగి అందులో భాగమవుతున్నానని నటుడు పరేష్ రావల్ తాజాగా స్పష్టం చేశారు. ఇటీవల పాడ్‌కాస్ట్‌లో కనిపించిన ఆయన, చిత్ర బృందంతో పరిస్థితులు చక్కబడ్డాయని, దర్శకుడు ప్రియదర్శన్‌తో మంచి స్నేహం ఉందని చెప్పారు.  అక్షయ్ కుమార్, సునీల్ శెట్టితో కలిసి ఈ ప్రాజెక్ట్‌లో చేరానని తెలిపారు. వారు ముగ్గురు మంచి స్నేహితులని  పరేష్‌ రావల్‌ అన్నారు. ఆపై అక్షయ్ కుమార్ తనకు చిరకాల స్నేహితుడని ఆయన కితాబు ఇచ్చారు. రావల్ అకస్మాత్తుగా సినిమా నుండి నిష్క్రమించిన తర్వాత.., అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ అతనిపై రూ. 25 కోట్ల దావా వేసింది, అతని చర్యల వల్ల ఆర్థిక నష్టాలు సంభవించాయని, నిర్మాణ షెడ్యూల్‌కు అంతరాయం కలిగిందని ఆరోపించింది. ఈ కారణం వల్లే ఆయన తిరిగి ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

పరేష్‌ రావల్‌ ఈ మూవీ కోసం రూ. 15 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయన ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అడ్వాన్స్‌ కూడా తీసుకున్నారట. అందుకే న్యాయపరమైన చిక్కులు వస్తాయిని తన మనసు మార్చుకున్నారని టాక్‌. బాలీవుడ్‌లో వినోదాత్మక చిత్రాభిమానులను అలరిస్తుందనే భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్ర ‘హేరా ఫేరి 3‘(Hera Pheri 3) . ఈ సినిమాలో బాలీవుడ్‌ అగ్ర  కధానాయకుడు అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్నాడు.  ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement