దురంధర్‌-2 రిలీజ్‌.. పాకిస్తాన్‌ వీడియోలు వైరల్..! | Pakistan Karachi Spy Hunt Videos Went Viral After Ranveer Singh Dhurandhar 2 Movie Release | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 Movie: దురంధర్‌-2 రిలీజ్‌.. పాకిస్తాన్‌ వీడియోలు వైరల్..!

Mar 23 2026 3:50 PM | Updated on Mar 23 2026 5:15 PM

pakistan Videos Viral after Dhurandhar 2 movie release

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ దురంధర్‌-2 థియేటర్లలో సందడి చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లేనే రూ.500 కోట్ల మార్క్ దాటిన ఈ చిత్రం పలు రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజైంది. పాకిస్తాన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ వేళ సోషల్ మీడియాలో పాకిస్తాన్‌కు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. ఇప్పుడు కరాచీలోని లియారి ప్రాంతంలో పోలీసులు స్పై లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమోననని సోదాలు చేస్తున్నారు. అక్కడి ప్రాంతంలోని లోకల్ ప్రజలంతా కలిసి ఇండియన్ స్పైల కోసం వెతుకుతున్న వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ వీడియో ఇప్పటిదా.. లేదాంటే పాతదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement