'ఓ భామ అయ్యో రామా' ట్రైలర్‌.. హిట్‌ కొట్టేలా సుహాస్‌ | Actor Suhas Oh Bhama Ayyo Rama Movie Theatrical Trailer Out Now, Watch Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

'ఓ భామ అయ్యో రామా' ట్రైలర్‌.. హిట్‌ కొట్టేలా సుహాస్‌

Jul 5 2025 12:24 PM | Updated on Jul 5 2025 1:10 PM

Oh Bhama Ayyo Rama Theatrical Trailer Out Now

టాలీవుడ్‌ హీరో సుహాస్, మాళవిక మనోజ్‌ నటించిన 'ఓ భామ అయ్యో రామా'(Oh Bhama Ayyo Rama)  సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ విడుదలైంది.  ఈ ప్రేమకథ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వీ ఆర్ట్స్‌ బ్యానర్‌లో హరీశ్ నల్లా నిర్మించారు.  జూలై 11న ప్రేక్షకుల ముందుకు  రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌ ప్రేక్షకులను మెప్పించాయి. తాజాగా వచ్చిన ట్రైలర్‌ కూడా అంతే స్థాయిలో ఉంది.  కామెడీ, లవ్‌, ఎమోషనల్‌ సీన్స్‌తో ట్రైలర్‌ కట్‌ ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కాగా.. ఈ చిత్రంలో రవీందర్ విజయ్, బబ్లూ పృథ్వీ రాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, సాథ్విక్ ఆనంద్, నయని పావని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాధన్ సంగీతమందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement