మంచి కామెడీ దెయ్యం | O Manchi Ghost Pre Release Event | Sakshi
Sakshi News home page

మంచి కామెడీ దెయ్యం

Published Thu, Jun 20 2024 1:36 AM | Last Updated on Thu, Jun 20 2024 10:54 AM

O Manchi Ghost Pre Release Event

నందితా శ్వేత, ‘వెన్నెల’ కిశోర్, నవమీ గాయక్, ‘షకలక’ శంకర్, రజత్‌ రాఘవ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘ఓఎమ్‌జీ (ఓ మంచి ఘోస్ట్‌). శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వంలో డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నందితా శ్వేత మాట్లాడుతూ–‘‘శంకర్‌గారు స్టోరీ నరేట్‌ చేస్తుంటే నవ్వుతూనే ఉన్నాను. 

హారర్, కామెడీ జానర్స్‌ మిళితమై వస్తున్న ఈ సినిమాను కుటుంబసమేతంగా చూడొచ్చు’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రాపారంభం కావడానికి కారణమైన సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్, మూవీ స్క్రిప్ట్, డైలాగ్స్‌లో సాయం చేసిన దర్శకుడు రితేష్‌ రానా, మాపై నమ్మకం ఉంచిన అబినికా, ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్న ఏషియన్‌ ఫిల్మ్స్, బాలాజీ ఫిల్మ్స్‌లకు ధన్యవాదాలు’’ అన్నారు శంకర్‌ మార్తాండ్‌. ‘‘కథను ఎంత బాగా చె΄్పారో, అంత బాగా సినిమా తీశారు శంకర్‌’’ అన్నారు అబినికా ఇనాబతుని.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement