ఎన్టీఆర్ 'దేవర' నుంచి మరో ట్రైలర్? | NTR Devara Trailer New And Pre Release Event Details | Sakshi
Sakshi News home page

Devara Trailer: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మరో ట్రైలర్ లాంచ్

Sep 21 2024 9:26 AM | Updated on Sep 21 2024 9:47 AM

NTR Devara Trailer New And Pre Release Event Details

ఎన్టీఆర్ 'దేవర' మూవీ రిలీజ్‌కి మరో ఆరురోజులే ఉంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ కంటెంట్‌ బాగానే ఇస్తున్నారు. మరోవైపు ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. వీటన్నింటితో పాటు 'దేవర' టీమ్ మరో సర్‌ప్రైజ్ కూడా ప్లాన్ చేసిందట.

(ఇదీ చదవండి: తీస్తే 'దేవర' 8-9 గంటల సినిమా అయ్యేది: ఎన్టీఆర్)

కొన్నిరోజుల క్రితం 'దేవర' ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే దీనికి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ మూవీపై కాస్త నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో మూవీపై హైప్ పెరగాలంటే మాస్ కంటెంట్ రావాలి. ఇందుకు తగ్గట్లే ఫుల్ యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ రెడీ చేశారని, దీన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు 'ఆయుధ పూజ' సాంగ్ కూడా ఈ పాటికే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఎందుకో వెనక్కి తగ్గారు. బహుశా థియేటర్లలో చూసి థ్రిల్ అవ్వాలని ఇలా ప్లాన్ చేశారేమో. ఇకపోతే 'దేవర'లో తారక్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా చేశాడు. అనిరుధ్ సంగీత దర్శకుడు కాగా కొరటాల దర్శకుడు. సెప్టెంబరు 27న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్ నోట తమిళనాడు ఫేమస్ బిర్యానీ.. ఏంటంత స్పెషల్?)

Advertisement
 
Advertisement
Advertisement