Actress Nithya Menon Opens Up About Santhosh Varkey Issue, Goes Viral - Sakshi
Sakshi News home page

Nithya Menon-Santhosh Varkey Issue: ఆ వ్యక్తి ఆరేళ్లు వేధించాడు.. క్షమించి వదిలేశా

Aug 7 2022 8:56 AM | Updated on Aug 7 2022 9:40 AM

Nithya Menon Opens About Santhosh Varkey Issue - Sakshi

ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సెలబ్రిటీస్‌ ఇందుకు అతీతం కాదు. నిత్యామీనన్‌ కూడా అలాంటి వేధింపులు ఎదుర్కొన్నారట. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఈ మలయాళ కుట్టి చాలా డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ నటి అని చెప్పొచ్చు. ఏ విషయాన్ని అయినా కుండ బద్ధలు కొట్టినట్టు చెబుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. విజయ్‌ సేతుపతితో కలిసి నటించిన మలయాళ చిత్రం ఇటీవల విడుదలైంది.

ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా నిత్యామీనన్‌ తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంది. తనను ఒక వ్యక్తి గత ఆరేళ్లుగా వేధింపులకు గురి చేశారని చెప్పింది. నటుడు మోహన్‌లాల్‌ ఆరాట్టు సినిమా పేరుపై విశ్లేషణ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చిన సంతోష్‌ వర్గీ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేసి ఇబ్బందులకు గురి చేశాడని వాపోయింది.

చాలా మంది అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారని, అయితే తాను మాత్రం అతన్ని క్షమించి వదిలేశానని తెలిపింది. సంతోష్‌ తనను చాలా రకాలుగా అన్‌ పాపులర్‌ చేశాడని, చివరకు తన తల్లిదండ్రులు కూడా ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసి అతన్ని గట్టిగా హెచ్చరించారని పేర్కొంది. తన గురించి సంతోష్‌ చెప్పేవన్నీ అసత్యాలని వాటిని ఎవరూ నమ్మవద్దని కోరింది. కాగా ప్రస్తుతం ఈమె తమిళంలో ధనుష్‌కు జంటగా నటిస్తున్న తిరు చిట్రంబలమ్‌ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.   

Advertisement
 
Advertisement
Advertisement