Nindha Teaser : ఆసక్తి రేపుతున్న ‘నింద’ టీజర్‌ | Nindha Teaser Out | Sakshi
Sakshi News home page

Nindha Teaser : ఆసక్తి రేపుతున్న ‘నింద’ టీజర్‌

May 16 2024 4:04 PM | Updated on May 16 2024 4:04 PM

Nindha Teaser Out

వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నింద’. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజేష్‌ జగన్నాథం దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విలక్షణ నటుడు నవీన్ చంద్ర విడుదల చేశారు. టీజర్ విడుదల చేసిన అనంతరం చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. టీజర్ బాగుందని టీంను మెచ్చుకున్నారు.

‘జీవితంలో కొన్ని సార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’.. అనే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్‌లో ఎన్నో కోణాలున్నాయి. అందమైన ప్రేమ కథ కనిపిస్తోంది. దాంతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ టీజర్‌లోని విజువల్స్ ఎంతో న్యాచురల్‌గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ అయితే మూడ్‌కు తగ్గట్టుగా సాగింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను ఫీల్ అయ్యేలా నేపథ్య సంగీతం సాగింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతూన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement