నిజ జీవిత ఘటనలతో ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ | Nimmakaya Neekenduku Bayam Movie Opening Ceremony Highlights, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

నిజ జీవిత ఘటనలతో ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’

Jul 2 2026 8:30 AM | Updated on Jul 2 2026 9:52 AM

Nimmakaya Neekenduku Bayam Movie Opening Ceremony Highlights

సుమన్‌ , ఆమని ప్రధాన పాత్రల్లో, రాజేష్‌ భూపతి హీరోగా, స్వప్నరాజ్, అబిత హీరోయిన్లుగా   ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ సినిమా ఆరంభమైంది. రోశిరెడ్డి పందిళ్లపల్లి దర్శకత్వంలో బి.వి.సి ఫిల్మ్స్‌పై బీఎన్‌ ఆర్‌ చౌదరి నిర్మిస్తున్న ఈ మూవీ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సాయి వెంకట్‌ కెమెరా స్విచ్చాన్‌  చేయగా, పీసీసీ జనరల్‌ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్‌ గుత్తా క్లాప్‌ ఇచ్చారు. 

తొలి సన్నివేశానికి టీఎఫ్‌సీసీ చైర్మన్‌  ప్రతాని రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. సుమన్‌  మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలోని హారర్, థ్రిల్లర్‌ అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి’’ అన్నారు. ‘‘నిమ్మకాయ’ చుట్టూ ఉన్న అపోహలను కథాంశంగా తీసుకుని నిజ జీవిత ఘటనలతో ఈ మూవీ తీస్తున్నాం’’ అన్నారు రాజేష్‌ భూపతి, రోశిరెడ్డి. ఈ సినిమాకు సంగీతం: వరికుప్పల యాదగిరి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement