నింద మైలురాయిగా నిలవాలి: నిఖిల్‌ సిద్ధార్థ్‌ | nikhil siddharth about ninda movie | Sakshi
Sakshi News home page

నింద మైలురాయిగా నిలవాలి: నిఖిల్‌ సిద్ధార్థ్‌

Jun 18 2024 1:56 AM | Updated on Jun 18 2024 10:41 AM

nikhil siddharth about ninda movie

రాజేశ్, నిఖిల్‌ సిద్ధార్థ్, వరుణ్‌ సందేశ్‌

‘‘నింద’ టీజర్, ట్రైలర్‌ బాగున్నాయి. మంచి కథతో పాటు చాలా క్వాలిటీతో తెరకెక్కించారు. నా కెరీర్‌లో ‘స్వామి రారా, కార్తికేయ’ సినిమాల్లా వరుణ్‌ సందేశ్‌ కెరీర్‌లో ‘నింద’ ఓ మైలురాయిగా నిలవాలి. ఈ చిత్రానికి ప్రేక్షకులు పెద్ద విజయం అందించాలి’’ అని హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ అన్నారు. వరుణ్‌ సందేశ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నింద’. రాజేశ్‌ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నిఖిల్‌ సిద్ధార్థ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఈ వేడుకలో వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ– ‘‘నింద’ నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. రాజేశ్‌గారు ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా నిర్మించి, దర్శకత్వం వహించారు. మా చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ వారు రిలీజ్‌ చేస్తుండటం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ‘హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ’ చిత్రాల తర్వాత ‘నింద’ నిలుస్తుందని గర్వంగా చెప్పుకోగలను’’ అన్నారు. ‘‘నింద’ మూవీ అవుట్‌పుట్‌ నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. మా సినిమాతో వరుణ్‌ మంచి కమ్‌ బ్యాక్‌ ఇస్తాడు’’ అన్నారు రాజేశ్‌ జగన్నాథం.

Advertisement
 
Advertisement
Advertisement