The Night Manager Actor Rukhsar Rehman To Divorce 2nd Husband Faruk Kabir, Deets Inside - Sakshi
Sakshi News home page

Rukhsar Rehman Divorce: విడాకులకు సిద్ధమైన 'ది నైట్ మేనేజర్' నటి..!

Jun 30 2023 9:43 PM | Updated on Jul 1 2023 11:23 AM

The Night Manager actor Rukhsar Rehman to divorce 2nd husband Faruk Kabir - Sakshi

ది నైట్ మేనేజర్ నటి రుక్సర్ రెహ్మాన్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దాదాపు పెళ్లైన 13 ఏళ్ల తర్వాత తన రెండో భర్త ఫరూక్ కబీర్‌తో విడాకులు తీసుకోనున్నట్లు తెలిపింది. సినీ దర్శకుడైన ఫరూక్ కబీర్‌తో రుక్సర్ విడాకులు తీసుకుంటున్నట్లు గతంలో రూమర్స్ వచ్చాయి. ఫిబ్రవరి నుంచి వేరువేరుగా జీవిస్తున్న ఈ జంట తమ వివాహా బంధానికి గుడ్ బై చెప్పనున్నారు. 

(ఇది చదవండి: 'ది నైట్ మేనేజర్'.. ఆ సీన్‌తో తమన్నాను మించిపోయిందిగా..!)

రుక్సర్ రెహ్మాన్ ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ ఫిబ్రవరి నుంచి తాము విడిగా జీవిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తాము విడిపోవడానికి నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అయితే చట్టపరమైన ప్రక్రియ ముగియడానికి మరింత సమయం పడుతుందని తెలిపింది. మరోవైపు ఫరూక్ కబీర్ కూడా ఈ వార్తలను ధృవీకరించారు. ఇది నా వ్యక్తిగత విషయం కాబట్టి దీని గురించి ఇప్పుడే మాట్లాడదలుచుకోలేదన్నారు. 

కాగా.. రుక్సర్, ఫరూక్ మార్చి 2010లో వివాహాం చేసుకున్నారు. దాదాపు ఆరేళ్ల పాటు రిలేషన్ షిప్‌ తర్వాత పెళ్లి పీటలెక్కారు. గతేడాది ఆయన దర్శకత్వం వహించిన ఖుదా హాఫీజ్- 2లో ఈ జంట కలిసి పనిచేశారు. కాగా.. రుక్సర్ రెహ్మాన్ గతంలో అసద్ అహ్మద్‌ను వివాహం చేసుకున్నారు. వారికి 27 ఏళ్ల ఐషా అహ్మద్ అనే కుమార్తె ఉంది. రుక్సర్ రెహ్మాన్.. పీకే, 83, గాడ్, తుస్సీ గ్రేట్ హో, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, వంటి చిత్రాలలో నటించింది. అంతే కాకుండా కుచ్ తో లోగ్ కహెంగే, డ్రీమ్ గర్ల్, అదాలత్ సిరీస్‌ల్లో కనిపించింది. తాజాగా.. ఆదిత్య రాయ్ కపూర్ నటించిన వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్‌లో కనిపించింది.

(ఇది చదవండి: రామ్ చరణ్ -ఉపాసన బిడ్డకు ఖరీదైన గిఫ్ట్.. స్పందించిన మెగా టీం!)

Advertisement
 
Advertisement
Advertisement