ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ ముద్దుగుమ్మ గతేడాది రిలీజైన ప్రభాస్ ది రాజాసాబ్ చిత్రంలో హీరోయిన్‌గా మెప్పించింది. ప్రస్తుతం సినిమాలు లేకపోయినా.. తాజాగా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైంది.
ఈ సందర్భంగా తనకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటారా? అని ఓ రిపోర్టర్ అడగడంతో దీనిపై స్పందించింది. అది తెలియదు.. మే బీ చేసుకోవచ్చంటూ సరదాగా నవ్వుతూ సమాధానమిచ్చింది. అంతేకాకుండా తనకు తెలుగు రాష్ట్రాలతో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టానని తెలిపారు. తాను కూడా తెలుగమ్మాయినేనని నిధి అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


