హీరోతో ప్రేమ? క్లారిటీ ఇచ్చేసిన నిధి అగర్వాల్ | Nidhhi Agerwal Clarify Relationship With Simbu | Sakshi
Sakshi News home page

Nidhhi Agerwal: తమిళ హీరోతో రిలేషన్.. నిధి ఏం చెప్పిందంటే?

Jun 1 2025 9:13 PM | Updated on Jun 1 2025 9:13 PM

Nidhhi Agerwal Clarify Relationship With Simbu

సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమలో ఉన్నారని రూమర్స్ రావడం సహజం. కలిసి సినిమా చేస్తున్న టైంలో ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇటీవల కాలంలో అయితే శ్రీలీల.. బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్‌తో డేటింగ్ చేస్తుందని టాక్ వినిపించింది. ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే ఇప్పుడు మరో హీరోయిన్.. తనపై వస్తున్న గాసిప్స్ గురించి క్లారిటీ ఇచ్చేసింది.

(ఇదీ చదవండి: స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా)

'ఇస్మార్ట్ శంకర్'తో పాటు తెలుగులో పలు సినిమాలు చేసిన నిధి అగర్వాల్.. ప్రభాస్‌తో 'రాజాసాబ్', పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రాల్లో నటించింది. పవన్ మూవీ.. ఈ నెల 12న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో పాల్గొన్న నిధికి.. తమిళ హీరో శింబుతో రిలేషన్ అంటూ వచ్చిన రూమర్స్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికి సవివరంగా క్లారిటీ ఇచ్చేసింది.

'సినిమాల్లో నటించిన హీరోయిన్ల గురించి చాలా పుకార్లు వస్తాయి. మరీ ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితం గురించి అందరూ ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఏది అనిపిస్తే అది బయటకు అనేస్తారు. ఇదంతా చాలా కామన్. ఎందుకంటే జనాలకు నిజాల కంటే రూమర్లపైనే ఎక్కువ ఇంట్రెస్ట్. అందుకే నేను వాటిని పెద్దగా పట్టించుకోను. నా గురించి ఎప్పుడూ ఏదో ఒకటి ఇలాంటివి వినిపిస్తూనే ఉంటాయి' అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది)

Advertisement
 
Advertisement
Advertisement