హైదరాబాద్‌ తిరిగొచ్చిన నవ దంపతులు! | Newlyweds Abhiram Daggubati And Prathyusha Return To India From Srilanka, Airport Video Goes Viral - Sakshi
Sakshi News home page

Abhiram Daggubati-Prathyusha Airport Video: శ్రీలంకలో పెళ్లి.. ఇండియాకు తిరిగొచ్చేసిన అహింస హీరో

Dec 9 2023 11:10 AM | Updated on Dec 9 2023 11:56 AM

Newlyweds Abhiram Daggubati, Prathyusha Return from Srilanka - Sakshi

ఈ జంట ఎయిర్‌పోర్టులో దిగి ఇంటికి బయల్దేరుతున్న ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. కాగా ప్రకాశం జిల్లాలోని కారంచేడుకు చెందిన మా

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌ తనయుడు, టాలీవుడ్‌ యంగ్‌ హీరో అభిరామ్‌ వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. వరుసకు మరదలైన ప్రత్యూష అనే అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిచాడు. డిసెంబర్‌ 6న శ్రీలంకలో వీరి వివాహం ఘనంగా జరిగింది. మూడు రోజుల పాటు ఈ పెళ్లి తంతు నిర్వహించగా.. ఇరు కుటుంబసభ్యులు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరైనట్లు తెలిసింది. పెళ్లి సంబరాలు ముగియడంతో శుక్రవారం నాడు ఈ కొత్త జంట హైదరాబాద్‌కు తిరిగొచ్చింది.

ప్రత్యూష చక్కగా చీర కట్టుకోగా అభిరామ్‌ క్యాజువల్‌ తెలుపు షర్ట్‌, బ్లాక్‌ జీన్స్‌ వేసుకుని దర్శనమిచ్చాడు. ఈ జంట ఎయిర్‌పోర్టులో దిగి ఇంటికి బయల్దేరిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. కాగా ప్రకాశం జిల్లాలోని కారంచేడుకు చెందిన మాధవి-నగేశ్‌ చాపర్ల కూతురే ప్రత్యూష. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తోంది.

ఇకపోతే సురేశ్‌బాబుకు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి రానా ఇప్పటికే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండో అబ్బాయి అభిరామ్‌ అహింస సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తేజ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొద్దిరోజుల క్రితమే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలోనూ రిలీజైంది. అయితే ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. దీంతో కొంతకాలం గ్యాప్‌ తీసుకున్నాకే సినిమాలు చేస్తానన్నాడు అభిరామ్‌.

చదవండి: ఆ హీరో సీరియల్‌ కిస్సర్‌.. కానీ మా మధ్య కెమిస్ట్రీ లేకపోవడం వల్ల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement