
ఈ బ్యూటీ ఫిట్‌నెస్ రహస్యం వివరాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.. నయనతార బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండటానికి కారణం జిమ్ వర్కౌట్స్,
సంచలనం అన్న పదానికి మారు పేరు నయనతార అనవచ్చు. ఎక్కడో కేరళ రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో పుట్టి, ఆశనిరాశల మధ్య నటిగా మారి, అవమానాలు, విమర్శల నడుమ కథానాయికగా ఎదిగి, ఇప్పుడు క్రేజీ ఇండియన్ హీరోయిన్‌గా వెలిగొందుతోంది. దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం డిమాండ్ చేస్తున్న లేడీ సూపర్ స్టార్‌గా నిలిచింది. నాలుగు పదుల వయసును టచ్ చేయనున్న నయనతార ఇప్పటికీ ఫిట్‌నెస్‌లో తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతోంది.
పెళ్లి చేసుకుని ఇద్దరు కవల పిల్లలకు తల్లి (సరోగసి విధానం ద్వారా) అయినా నయనతార ఇప్పటికీ కథానాయికగా నటిస్తూనే ఉంది. అందంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ బ్యూటీ ఫిట్‌నెస్ రహస్యం వివరాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.. నయనతార బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండటానికి కారణం జిమ్ వర్కౌట్స్, యోగాలే. ముఖ్యంగా నయనతార ఫిట్‌నెస్‌కు యోగా బాగా ఉపకరించింది.
ఈమె నిత్యం రెండు గంటలు యోగా చేస్తుందట. అలాగే ఈమె డైట్ ప్లానింగ్‌లో కచ్చితంగా కొబ్బరినీళ్లు ఉండాల్సిందేనట. ఉదయం అల్పాహారంలో పళ్ల రసం తప్పనిసరి. పళ్లరసం బరువును తగ్గించడంతోపాటు ఎనర్జీ పెరగడానికి దోహదపడుతుంది. మధ్యాహ్నం భోజనంలో నాన్ వెజ్, గుడ్డు, కాయగూరలు సమపాళ్లలో తీసుకుంటుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ కలిగిన పదార్థాలను దూరంగా పెడతుందట. ఇకపోతే రోజుకు 8 గంటలు నిద్ర పోవడమనే అలవాటును క్రమం తప్పకుండా పాటిస్తుందట. మంచి నిద్రవల్ల కూడా బరువును కంట్రోల్‌లో ఉంచుతుందన్నమాట!
చదవండి: సన్మానం చేస్తే తినడానికి అరటిపండ్లు తేవొచ్చుగా అని దీనంగా అడిగిన టంగుటూరి!