ఎన్టీఆర్ బావమరిది ఫస్ట్ సినిమా.. ఇన్నాళ్లకు మోక్షం | Narne Nithin Sri Sri Sri Rajavaru Trailer | Sakshi
Sakshi News home page

Sri Sri Sri Rajavaru Trailer: 'మ్యాడ్' హీరో తొలి మూవీ ట్రైలర్ రిలీజ్

May 31 2025 3:43 PM | Updated on May 31 2025 5:16 PM

Narne Nithin Sri Sri Sri Rajavaru Trailer

జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్.. ఇప్పటికే హీరోగా మూడు సినిమాలు చేశాడు. అవే 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్'. అయితే ఇతడు పరిచయ చిత్రం మాత్రం వాయిదాలు మీద వాయిదాలు పడుతూనే ఉంది. అప్పుడెప్పుడో 2022లో లాంచ్ చేశారు. ఇన్నాళ్లకు దానికి మోక్షం కలిగింది. జూన్ 6న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ముగ్గురు హీరోల 'భైరవం' తొలిరోజు కలెక్షన్స్)

'శ్రీశ్రీశ్రీ రాజావారు' పేరుతో తీసిన ఈ సినిమాలో నార్నే నితిన్‪‌తో పాటు రావు రమేశ్, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'శతమానం భవతి' ఫేమ్ సతీశ్ వేగ్నేశ దర్శకుడు. తాజాగా రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ పల్లెటూరి కుర్రాడు. ఓ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. కానీ సిగరెట్ అలవాటు వల్ల ఇతడి జీవితంలో ఎక్కడలేని కష్టాలన్నీ వస్తాయి. చివరకు ఏమైంది? హీరో సిగరెట్ అలవాటు మానేశాడా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.

విజువల్స్ చూస్తుంటే రిచ్‌గా ఉన్నాయి గానీ ట్రైలర్ మాత్రం అంతంత మాత్రంగానే అనిపించింది. ప్రమోషన్స్ మీద మాత్రం టీమ్ అస్సలు దృష్టి పెట్టలేదు. మరి కారణాలేంటో వాళ్లకే తెలియాలి. వచ్చే వారం థియేటర్లలో కమల్ హాసన్ 'థగ్ లైఫ్' మూవీ రిలీజ్ కానుంది. దీనిపై కాస్తోకూస్తో హైప్ ఉంది. మరి దీంతో పోటీపడి 'రాజావారు' మూవీ ఏం చేస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: వారానికే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement