నాని హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. టాక్ ఎలా ఉన్నప్పటికీ వసూళ్లపరంగా అదరగొట్టింది. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా మెప్పించింది. సవారీలు అనే జాతి తమ మనుగడ కోసం చేసే పోరాటం అధారంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
తాజాగా ఈ మూవీ సూపర్ హిట్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. అభిమానులను షేక్ చేసిన ఆయా షేర్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ పాటలో నాని తన స్టెప్పులతో అదరగొట్టేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫుల్ వీడియో సాంగ్ మీరు కూడా చూసేయండి.


