కింగ్‌డమ్‌ గురించి తిడుతూనే ఉన్నారు.. మీకు మాటిస్తున్నా: నాగవంశీ | Naga Vamsi Tweet on Vijay Devarakonda Kingdom Movie Postponed | Sakshi
Sakshi News home page

Naga Vamsi: మాటిస్తున్నా.. కింగ్‌డమ్‌దే గెలుపు అంటూనే రిలీజ్‌ వాయిదా

Jun 30 2025 2:06 PM | Updated on Jun 30 2025 3:06 PM

Naga Vamsi Tweet on Vijay Devarakonda Kingdom Movie Postponed

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ కింగ్‌డమ్‌. జెర్సీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో లేటెస్ట్‌ సెన్సేషన్‌ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగాన్ని మార్చి 28న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ సినిమా పూర్తి కాకపోవడంతో మే 30కి వాయిదా వేశారు. అప్పటికీ కింగ్‌డమ్‌కు మెరుగులు దిద్దడం కంప్లీట్‌ కానందున జూలై 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సరిగ్గా ఇదే రోజు నితిన్‌ తమ్ముడు చిత్రం విడుదలవుతోంది.

మళ్లీ వాయిదా
అయితే కింగ్‌డమ్‌ (Kingdom Movie) వాయిదా పడటం ఖాయం అంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. చివరకు అదే నిజమైంది. కింగ్‌డమ్‌ వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ ట్వీట్‌ చేశాడు. నేను ఏం పోస్ట్‌ చేసినా కింగ్‌డమ్‌ సినిమా గురించి తిట్లు వస్తూనే ఉంటాయని నాకు తెలుసు. మీకు వెండితెరపై ఒక అద్భుతమైన అనుభూతిని అందించేందుకు మా టీమ్‌ ఎంతగానో కృషి చేస్తోంది. మీకు మాటిస్తున్నా.. కింగ్‌డమ్‌ చూశాక మీకు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేనంత గొప్పగా ఉంటుంది. 

కింగ్‌డమ్‌దే విజయం
నేను ఎంతో నమ్మితే కానీ ఇలా మాట్లాడనని మీకు తెలుసు. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా మీ క్రియేటివిటీ అంతా నాపై చూపిస్తారు. నేను సినిమా చూసి చెప్తున్నా.. కింగ్‌డమ్‌దే గెలుపు. త్వరలోనే అదిరిపోయే రిలీజ్‌ డేట్‌ టీజర్‌, సాంగ్‌ అనౌన్స్‌మెంట్‌తో కలుద్దాం అన్నాడు. దీంతో కింగ్‌డమ్‌ వాయిదా కన్‌ఫార్మ్‌ అయిపోయింది.

 

 

చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement