
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. కొందరు నచ్చిందని చెబుతున్నారు. మరికొందరు మాత్రం నచ్చలేదని అంటున్నారు. అంటే ప్రస్తుతానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఒకటి రెండు రోజులు ఆగితే అసలు సంగతి ఏంటో బయటపడుతుంది. ఇకపోతే తాజాగా హైదరాబాద్‌లో మూవీ సక్సెస్ మీట్ పెట్టారు. ఇందులో మాట్లాడిన నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూవీ నచ్చకపోతే ఫోన్ చేసి తిట్టండి అని అన్నారు.
'సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది ఇలాంటివి ఏమి పట్టించుకోకండి. ప్రతి సినిమాకు కామన్ ఇవి. సినిమా అయితే చాలా బాగుంది మీ అందరికీ నచ్చుతుంది మంచి హై ఇస్తుంది. మీకు నచ్చకపోతే కాల్ చేసి తిట్టండి అంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. మూవీలోని టెక్నికల్ అంశాలు హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయి' అని నాగవంశీ అన్నారు.
(కింగ్డమ్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
నిర్మాతగా ఆయన తీసిన సినిమాని నాగవంశీ మెచ్చుకున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ పూర్తి రిజల్ట్ ఏంటనేది వీకెండ్ గడిస్తే క్లారిటీ వచ్చేస్తుంది. 'కింగ్డమ్'లో విజువల్స్, విజయ్ దేవరకొండ యాక్టింగ్ అన్నీ బాగానే ఉన్నాయని చూసొచ్చిన ప్రేక్షకులు అంటున్నారు. కానీ సెకండాఫ్‌లో ల్యాగ్ ఉందని కంప్లైంట్ చేస్తున్నారు. అలానే హీరోహీరోయిన్ మధ్య రొమాంటిక్ సాంగ్ కూడా మూవీలో లేకపోవడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. ఇదే విషయమై సక్సెస్ మీట్ నిర్మాతని అడగ్గా.. స్కోప్ లేకపోవడంతోనే పాటని పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు.
'కింగ్డమ్' విషయానికొస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్నప్పుడు దూరమైన అన్న శివ(సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో పోలీస్ అధికారులతో సూరికి గొడవ అవుతుంది. ఈ విచారణ సాగుతున్న సమయంలోనే సూరి.. ఓ అండర్ కవర్ మిషన్ బాధ్యతల్ని భుజాన వేసుకోవాల్సి వస్తుంది. శ్రీలంకలోని ఓ శివ ఉన్నాడని, అక్కడికి గూఢచారిగా వెళ్లాలనే పని సూరికి అప్పజెబుతారు. మరి ఆ ద్వీపంలో ఉన్న తెగకు, శివకీ సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ‘కింగ్డమ్’పై రష్మిక రివ్యూ.. ఒకే మాటతో తేల్చేసిందిగా!)
"మీకు #Kingdom సినిమా High ఇవ్వకపోతే Phone చేసి తిట్టండి, అంత Confident గా చెప్తున్నా...
Technicalities హాలీవుడ్ Standards లో ఉన్నాయి.."
- #NagaVamsi pic.twitter.com/R1L5wrgqKT— Movies4u Official (@Movies4u_Officl) July 31, 2025