
‘‘చాయ్‌వాలా’ సినిమా చూసిన ప్రేక్షకులు కచ్చితంగా తమ తండ్రితో కాసేపు మాట్లాడతారు. ఈ చిత్రం చూశాక థియేటర్ నుంచి ఓ మంచి భావోద్వేగంతో బయటికొస్తారని మాత్రం కచ్చితంగా చెప్పగలను’’ అని శివ కందుకూరి తెలి పారు. ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చాయ్‌వాలా’. శివ కందుకూరి, తేజు అశ్విని జోడీగా నటించారు. రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు నిర్మించారు. బుధవారం జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో శివ కందుకూరి మాట్లాడుతూ– ‘‘ఈ ప్రయాణంలో నాకు ప్రమోద్ మంచి స్నేహితుడిగా మారిపోయారు.
నిర్మాత వెంకట్‌గారికి సినిమా పట్ల ఎంతో ఫ్యాషన్ ఉంది. మా చిత్రం ప్రేక్షకులందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని చె΄్పారు. ‘‘చాయ్‌వాలా’ ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. ప్రమోద్ హర్ష మాట్లాడుతూ– ‘‘నేను రాసుకున్న పాత్రలు, కథ నుంచే ‘చాయ్‌వాలా’ టైటిల్‌ను తీసుకున్నాను. ప్రతి మనిషి జీవితంలో జరిగే ఘటనలే మా చిత్రంలో ఉంటాయి’’ అని చెప్పారు.
‘‘మా సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు కన్నీళ్లు వచ్చాయి. ఇదొక సున్నితమైన ప్రేమకథ’’ అని వెంకట్ ఆర్. పాపుడిప్పు పేర్కొన్నారు. ‘‘తెలుగులో ‘చాయ్‌వాలా’ నా మొదటి చిత్రం. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు తేజు అశ్విని. ‘‘ఈ కథ వినోదాత్మకంగా, అలాగే భావోద్వేగంగా ఉంటుంది. మా ‘చాయ్‌వాలా’ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని నటుడు రాజీవ్ కనకాల తెలి పారు. నటుడు రాజ్‌కుమార్ కసిరెడ్డి మాట్లాడారు.