
విజయ రామరాజు, సిజారోజ్ జోడీగా నటించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ని డైరెక్టర్ హను రాఘవపూడి విడుదల చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ–‘‘12 ఏళ్ల వయసులో అర్జున్ చక్రవర్తిగారి వద్దకు నేను కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్లినప్పుడు ఆయన ఒక కథ చెప్పారు.
ఆ కథని ఎలాగైనా ప్రపంచానికి చెప్పాలని భావించాను. అలా ఆ కథే నేను డైరెక్టర్ కావడానికి డ్రైవ్ చేసింది. ఈ సినిమాకి 46 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి’’ అని తెలిపారు. విజయ రామరాజు మాట్లాడుతూ– ‘‘నేను ఏడాదిన్నర పాటు ప్రో కబడ్డీ టీమ్స్‌తో ప్రయాణం చేసి, కబడ్డీ నేర్చుకుని ఈ సినిమా చేశాను’’ అని పేర్కొన్నారు. ‘‘ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రం నిర్మించాను’’ అన్నారు శ్రీని గుబ్బల. ఈ కార్యక్రమంలో సిజ్జా రోజ్, సంగీత దర్శకుడు విగ్నేష్ భాస్కరన్, కెమెరామెన్ జగదీష్, నటుడు దుర్గేష్ మాట్లాడారు.