
యూట్యూబ్‌లో ఫోక్ సాంగ్స్‌తో దుమ్ము లేపింది జాను లిరి (Janu Lyri). పద్ధతిగా చీర కట్టి, పల్లెటూరి అమ్మాయిగా స్టెప్పులేసే జాను ఫోక్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ పాపులారిటీతో ఢీ డ్యాన్స్ షోలోనూ పాల్గొని విజేతగా నిలిచింది. జానూకి గతంలో నటుడు టోనీ కిక్‌తో పెళ్లవగా వీరికి ఓ కుమారుడు జన్మించాడు. విభేదాల కారణంగా టోనీతో విడిపోయిన జాను కుమారుడితో కలిసి జీవిస్తోంది. అయితే ఆమె ఏం చేసినా సరే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటుంది.
రెండో పెళ్లి చేసుకుంటా..
ఆ మధ్య ట్రోలింగ్ తట్టుకోలేకపోతున్నా.. చచ్చిపోవాలనుంది అంటూ బోరుమని ఏడ్చింది. ఆ మరుసటి రోజే.. నేనెవరికీ భయపడను.. బాధతో డిప్రెషన్‌కు వెళ్లిపోయాను, ట్రోల్స్‌ను పట్టించుకోను అని ధైర్యం కూడదీసుకుంది. అంతేకాదు, ఫోక్ సింగర్ దిలీప్ దేవ్‌గణ్ (Dilip Devgan)తో దిగిన ఫోటో షేర్ చేస్తూ అతడే తనకు కాబోయే భర్త అని పరిచయం చేసింది. రెండో పెళ్లి చేసుకుంటానని కుండ బద్ధలు కొట్టింది.
హ్యాపీగా ఉన్నాం
మే నెలలో తమ ప్రేమను బయటపెట్టిన వీరిద్దరూ ఈ మధ్యే విడిపోయారంటూ తాజాగా ప్రచారం ఊపందుకుంది. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. తాజాగా ఈ రూమర్స్‌పై దిలీప్ స్పందించాడు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం అని ఒక్కముక్కలో తేల్చేశాడు. కానీ, ఈ విషయంపై అంతకుమించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు.
చదవండి: 'నేషనల్ క్రష్' గురించి ఎక్కువగా ఆలోచించను: రుక్మిణీ వసంత్