రెండో పెళ్లి.. కాబోయే భర్తను పరిచయం చేసిన జాను లిరి!
ఫోక్ డ్యాన్సర్ జాను లిరి కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జాను ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఫోక్ సింగర్ దిలీప్ దేవ్‌గన్‌ని పెళ్లి చేసుకోతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాలో వీరిద్దరు కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ..‘ఆశ్విరదించండి’ అని రాసుకొచ్చింది.కాగా ఇదే విషయాన్ని తెలియజేస్తూ సింగర్ దిలీప్ దేవ్గన్ కూడా ఇన్‌స్టాలో ఓ వీడియాని విడుదల చేశారు. ‘అందరికి నమస్కారం. నా పాటలు ఆదరించి, నన్ను ఈ స్థాయికి నిలబెట్టిన ప్రేక్షక దేవుళ్లకు, మీడియా మీత్రులకు నమస్కారం. రీసెంట్గా నేను పోస్ట్ చేసిన ఓ ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నిజంగానే నేను జాను పెళ్లి చేసుకోబోతున్నాం. ఒకరినొకరు ఇష్టం పడ్డాం. కలిసి బతుకాలనుకుంటున్నాం. అంతేకాని ఎలాంటి తప్పు చేయలేదు. మా ఇంట్లో ఒప్పుకున్నారు. జాను ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు చేసిన తట్టుకొని నిలబడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు సపోర్ట్ చేస్తున్నావారికి ధన్యవాదాలు’ అన్నారు.(ఇది చదవండి: రెండో పెళ్లి చేసుకుంటా.. అందరికీ సమాధానమిస్తా: జాను లిరి)నిన్న ఎమోషనల్.. నేడు గుడ్ న్యూస్ఫోక్ సాంగ్స్‌కు అదిరిపోయే స్టెప్పులేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న జాను.. ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 షో’ విన్నర్‌గా నిలిచి మరింత ఫేమస్ అయింది. నెట్టింట ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అదే సమయంలో జానుపై ట్రోలింగ్ కూడా భారీగానే పెరిగింది. ముఖ్యంగా ఆమె పర్సనల్ లైఫ్‌పై కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.ఈ విమర్శలను భరించలేకపోతున్నానంటూ భోరున విలపిస్తూ నిన్న ఓ వీడియోని షేర్ చేసింది. రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటంటూ..అందులో పేర్కొంది. చాలా మంది నెటిజన్స్ జాను ఎమోషనల్ వీడియోపై స్పందిస్తూ..ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇక నేడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాననే విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. View this post on Instagram A post shared by Jimmidi Jhansi - Janulyri (@janulyri_official)