
నాగశౌర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'బ్యాడ్ బాయ్ కార్తీక్' నుంచి మొదటి సాంగ్ తాజాగా విడుదలైంది. ఇందులో హీరోయిన్‌గా 'విధి యాదవ్' కనిపించనుంది. దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, వైవీఎస్ చౌదరి, శ్రీను వైట్ల వద్ద దర్శకత్వం విభాగంలో పని చేసిన రామ్ దేశిన (రమేశ్) ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు సహ రచయితగా చేసిన రామ్ దేశిన అద్భుతమైన కథతో యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో రానున్నారు.
శ్రీ వైష్ణవి ఫిల్మ్స్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ సినిమా నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, సముద్ర ఖని, మైమ్ గోపి తదితరులు ఇందులో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన 'నా మావ పిల్లనిత్తానన్నాడే..' పాటను కాసర్ల శ్యామ్ రచించగా.. హరిప్రియ, కారుణ్య ఆలపించారు. హారిస్ జైరాజ్ సంగీతం అందించారు.