హరినాథ్ పొలిచర్ల హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నా తెలుగోడు’(Na Telugodu). తనికెళ్ల భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నిధి పాల్, రోనీ కౌలా, సోఫియా తన్వీర్ ఇతర పాత్రలు పోషించారు. డ్రీం టీం ప్రొడక్షన్స్‌పై రూపొందిన ఈ సినిమా డిసెంబరుర్ 12న విడుదల కానుంది.
హరినాథ్ పొలిచర్ల మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో సైనికుడిగా చేశాను. సైనికులు దేశం కోసం జీవితాన్ని త్యాగం చేస్తారు. వారి జీవితంతో పాటు డ్రగ్స్ నుండి సమాజాన్ని కాపాడాలి, మహిళలను సంరక్షించాలంటూ సమాజానికి సందేశం ఇచ్చే అంశాలను మా చిత్రంలో చూపించాను. ఎన్టీఆర్‌గారి స్ఫూర్తితో ‘నా తెలుగోడు’ టైటిల్ పెట్టడం గర్వంగా ఉంది. మా చిత్రాన్ని ‘ఆర్‌కే’ పేరుతో హిందీలో విడుదల చేయనున్నాం’’ అన్నారు.


