దయచేసి మొక్కుతున్నా.. ఆలోచించండి: ఆర్పీ కంటతడి

Music Director RP Patnaik Shares A Video Over Coronavirus - Sakshi

ప్రస్తుతం దేశం వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విలయతాండవం చేస్తుంది. రోజురోజుకు కరోనా మరణాలు రెట్టింపు అవుతున్నాయి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఉండటం‍తో సమయానికి వైద్యం అందక సొంతవారి కళ్లముందే ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోన్ని రాజకీయ నాయకుల అవలంభిస్తున్న తీరు, కార్పోరేట్‌ హాస్పిట్లా వారి దోపిడిపై మ్యూజిక్‌ డైరెక్టర్‌, నటుడు, సింగర్‌ ఆర్పీ పట్నాయక్‌ అగ్రహం వ్యక్తం చేశారు. కొందరి నిర్ణక్ష్యం వల్లే అమాయకులైన ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టుకుంటూ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రతి ఒక్కరి కదిలిస్తోంది. ‘అందరికీ నమస్కారం.. నేను మీ ఆర్పీ పట్నాయక్.. చాలా బాధగా ఉంది.. ఒకప్పుడు మనం వుహాన్‌ను చూసినట్టు.. ప్రస్తుతం ప్రపంచం మన దేశాన్ని చూస్తోంది. చాలా మాట్లాడాలని ఉంది.. ఎంత వరకు మాట్లాడాలో తెలియడం లేదు.. కానీ ఇప్పుడు ఇది అవసరం.. మా అమ్మకు బెడ్ దొరకలేదని హాస్పిటల్‌ సిబ్బంది మీద దాడి చేశారు కొంతమంది. బెడ్స్ లేనప్పుడు వారు ఇవ్వలేరు కదా?.. అమ్మ చనిపోయినప్పుడు వారికి కోపం రావడం తప్పు లేదు కానీ అదే సమయంలో.. కోవిడ్ రోగులకు ట్రీట్మెంట్ ఇస్తోన్న సిబ్బంది మీద దాడి చేయడం వల్ల మిగతా వాళ్లు బాధలు పడుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి’ అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే ‘కరోనా లెక్కలన్నీ కూడా సరైనవి కావు. అసలైన లెక్కలు శశ్మానంలో కనిపిస్తుంటాయి. శవాలు కూడా క్యూలో ఉంటున్నాయి. ఆక్సిజన్ కోసం ఎంతో మంది హాస్పిటల్‌లో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎలక్షన్స్‌ ముఖ్యం, ఫలితాలు ముఖ్యం.. గెలిచింది.. ఓడింది.. నైతిక విజయం.. అది ముఖ్యం అని అనుకునే ధౌర్భాగ్యపు రాజకీయ నాయకులు ఉన్నారు చూడండి. ఎందుకయ్యా మీరు.. ఇంత మంది శవాల మీద ఆడుకుంటున్నారు. అసలు మీరు మనుషులేనా.. ఎన్నికలు అయ్యాయి కదా వాటి మీద మీరు పెట్టిన శ్రద్ద కనీసం ఒక్క శాతమైన ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీద పెట్టండి.. దయచేసి మొక్కుతున్నా.. కనీసం ఉన్న వాళ్లను ఎలా కాపాడుకోవాలనే ప్రయత్నం చేయండి’  ఆయన అభ్యర్థించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top