విజయ్ సినిమాలో ఎంఎస్‌ ధోని.. ఆ సీన్ చూశారా? | MS Dhoni Special Appearance in Vijay Upcoming Movie GOAT | Sakshi
Sakshi News home page

The GOAT Movie: ది గోట్ చిత్రంలో ఎంఎంస్‌ ధోని.. థియేటర్లో గూస్‌బంప్స్‌!

Sep 5 2024 10:14 AM | Updated on Sep 5 2024 10:40 AM

MS Dhoni Special Appearance in Vijay Upcoming Movie GOAT

కోలీవుడ్ స్టార్‌, దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం 'ది గోట్'(గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్‌ టైమ్‌). ఈ సినిమాకు వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ రోజో ది గోట్‌ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ఉదయం 4 గంటలకే చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ షోలు మొదలయ్యాయి. మొదటి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ వస్తోంది. దీంతో థియేటర్ల వద్ద విజయ్ ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు.

అయితే ఈ మూవీలో ఓ సీన్‌లో భారత మాజీ కెప్టెన్‌ ధోని కనిపించడంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఒక్కసారిగా ఫ్యాన్స్‌ అంతా కేరింతలు కొడుతూ.. తలా అంటూ నానా హంగామా చేశారు. ఆ సీన్‌లో ఎంఎంస్ ధోని ఐపీఎల్‌ బ్యాటింగ్‌కు వెళ్తూ కనిపించగా.. విజయ్ బైక్ ‍రైడ్‌ చేస్తూ కనిపించారు. ఈ సీన్‌తో విజయ్, ధోని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఐపీఎల్‌లో చెన్నై టీమ్‌కు మహేంద్ర సింగ్‌ ధోని ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ధోనికి పెద్దఎత్తున వీరాభిమానులు ఉన్నారు.

కాగా.. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. హీరో, విలన్ పాత్రల్లో ఆయన మెప్పించనున్నారు. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ కీలక పాత్రల్లో నటించారు.  ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్.. 2026లో తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు ముందు ఇదే చివరి చిత్రం కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement