మార్చి రిపోర్ట్‌: నిండా మునిగిన నిర్మాతలు.. 15 సినిమాల్లో ఒక్కటే హిట్టు! | Mollywood: Malayalam Cinema Box Office Report For March 2025, Only One Of 15 Films Was A Hit | Sakshi
Sakshi News home page

Box Office Report: పెట్టుబడి కొండంత.. రాబడి గోరంత..!

Apr 27 2025 12:45 PM | Updated on Apr 27 2025 1:21 PM

Mollywood: Malayalam Cinema Box Office Report March, 2025

మలయాళ సినిమా (Mollywood)కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. వరుసగా బాక్సాఫీస్‌ ఫెయిల్యూర్స్‌ నిర్మాతలను ఊపిరాడకుండా చేస్తున్నాయి. కేవలం ఒకటీరెండు చిత్రాలు మాత్రమే నిర్మాతలను గండం గట్టెక్కిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో లాభాల పంటకు బదులుగా నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాలు మార్చిలోనూ అదే వైఖరిని కొనసాగించాయి.

15 సినిమాల్లో ఒక్కటే హిట్టు
కేరళ చలనచిత్ర నిర్మాతల మండలి.. మార్చి బాక్సాఫీస్‌ రిపోర్ట్‌ (Mollywood: March Box Office Report)ను రిలీజ్‌ చేసింది. ఈ నివేదిక ప్రకారం.. మార్చిలో 15 చిత్రాలు విడుదలవగా ఒక్కటి మినహా మిగతావన్నీ ఫ్లాప్స్‌గా నిలిచాయి. ఈ సినిమాలన్నింటి బడ్జెట్‌ రూ.194 కోట్లు కాగా కేవలం రూ.25.88 కోట్ల షేర్‌ మాత్రమే తిరిగొచ్చింది. పెద్ద, చిన్న సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడ్డాయి. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఎల్‌ 2 : ఎంపురాన్‌ ఒక్కటే సూపర్‌ హిట్‌ సాధించింది. రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఔసెప్పింటె ఓసియతు మూవీ కేవలం రూ.45 లక్షలు రాబట్టడం గమనార్హం.

> రూ.2.70 కోట్లతో నిర్మితమైన పరివార్‌ సినిమాకు రూ.26 లక్షలు వచ్చాయి.
> రూ.3.65 కోట్లు పెట్టి తీసిన వడక్కన్‌ మూవీ కేవలం రూ.20 లక్షలే తిరిగి రాబట్టింది.
> రూ.70 లక్షలతో నిర్మితమైన డసెట్టంటె సైకిల్‌ చిత్రం అతి కష్టమ్మీద రూ.8 లక్షలు వసూలు చేసింది.

కాపాడింది ఈ ఒక్కటే..
మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ ఎల్‌ 2: ఎంపురాన్‌. ఈ మూవీకి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. లూసిఫర్‌ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. రూ.175 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

చదవండి: పిలిస్తే రానన్నానా? అంతేలే.. హర్టయిన రామజోగయ్య శాస్త్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement