
కోర్ట్ సినిమాలో న్యాయవాదిగా సీరియస్ పాత్రలో మెప్పించిన ప్రియదర్శి (Priyadarshi Pulikonda) ఇప్పుడు నవ్వించే పనిలో పడ్డాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన సారంగపాణి జాతకం (Sarangapani Jathakam Movie) ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
హర్టయిన రామజోగయ్య శాస్త్రి
ఈ క్రమంలో చిత్రయూనిట్ సెలబ్రిటీల కోసం స్పెషల్ షో వేశారు. డైరెక్టర్లు హరీశ్ శంకర్, కోన వెంకట్, నందినీ రెడ్డి, సింగర్ సమీరా భరద్వాజ్ సహా పలువురు తారలు ఈ షోకు హాజరయ్యారు. ఈ వీడియోను చిత్రయూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసి ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి హర్టయ్యారు.
పిలిస్తే రానన్నానా?
'నన్ను మర్చిపోయారుగా.. పిలిస్తే రానన్నానా? అంతేలే.. సరేలే, కానివ్వండి' అంటూ సారంగపాణి జాతకం నిర్మాత కృష్ణవేల్‌ను ట్యాగ్ చేశారు. మరి దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి! సారంగపాణి జాతకం సినిమా విషయానికి వస్తే.. ఇందులో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించారు. ఆదిత్య 369 ఫేమ్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఎన్నో హిట్ సాంగ్స్ రాసిన రామజోగయ్య శాస్త్రి.. సారంగపాణి జాతకంలో థీమ్ సాంగ్, చిత్రగుప్త పాటలకు సాహిత్యం అందించాడు.
యాక్టర్ కాలేవ్!
సారంగపాణి జాతకం మూవీలో ప్రియదర్శి.. జాతకాలను నమ్మే వ్యక్తిగా కనిపిస్తాడు. అయితే నిజ జీవితంలో అతడు జాతకం చూపించుకున్నప్పుడు అసలు నటుడయ్యే యోగమే లేదని చెప్పారట! అయినా అవేమీ నమ్మకుండా తనపై నమ్మకంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. బలగం, మల్లేశం, కోర్ట్ వంటి చిత్రాలతో మంచి నటుడిగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఇతడు ‘ప్రేమంటే, మిత్ర మండలి’ సినిమాలు చేస్తున్నాడు.
నన్ను మరిచిపోయారుగా
పిలిస్తే రానన్నానా @krishnasivalenk
అంతేలే..సరేలే..కానీండిలే https://t.co/cIa1WrftKo— RamajogaiahSastry (@ramjowrites) April 26, 2025
చదవండి: పాక్‌పై మనం దాడి చేయాల్సిన పనే లేదు.. వాళ్లే తిరగబడతారు: