షాకింగ్‌ అవతారంలో మోహన్‌బాబు.. ప్యారడైజ్‌ ఫస్ట్‌ లుక్‌ | Mohan Babu Joins Nani’s The Paradise as a Powerful Villain – First Look Out | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ అవతారంలో మోహన్‌బాబు.. ప్యారడైజ్‌ ఫస్ట్‌ లుక్‌

Sep 27 2025 11:49 AM | Updated on Sep 27 2025 12:04 PM

Mohan babu The paradise Movie First Look Out Now

నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్‌ సినిమా నుంచి అదిరిపోయే అప్టేట్‌ను మేకర్స్‌ పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో మోహన్‌బాబు భాగం  అవుతున్నారని క్లారిటీ ఇస్తూ ఒక పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ చిత్రం ఆయన పవర్‌ఫుల్‌ విలన్ పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే ఇదే విషయాన్ని ఆయన కుమార్తె మంచు లక్ష్మి స్వయంగా ధృవీకరించారు. ఆమె ప్రకారం, మోహన్‌బాబు ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శారీరకంగా కష్టపడి, కొత్త లుక్‌కి సిద్ధమయ్యారని చెప్పిన విషయం తెలిసిందే. ఇది ఆయనకు చాలా ప్రత్యేకమైన పాత్రగా భావిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌ చూస్తే  ఆమె మాటలు నిజమనేలా ఉన్నాయి.

ఒక ఏరియా డాన్‌గా మోహన్‌బాబు చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. కథ ప్రకారం, హీరో నానితో మొదట శత్రుత్వం, తర్వాత మిత్రత్వం ఏర్పడేలా పాత్ర ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతోంది, నాని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మోహన్‌బాబు గతంలో చేసిన పాత్రలతో పోలిస్తే ఇది విభిన్నమైన, గంభీరమైన పాత్రగా ఉండబోతుందని చిత్రబృందం భావిస్తోంది.

సోషల్ మీడియాలో ఓన్లీ వన్స్‌ ఫసక్‌ అనే డైలాగ్‌ చాలా పాపులర్‌ అని తెలిసిందే.  "ఫసక్‌" అనే పదం మోహన్‌బాబు  పంచ్ డైలాగ్‌గా విపరీతంగా పాపులర్ అయింది. దీని పేరుతో మీమ్స్‌, వీడియోలు, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. ఒకరకంగా ఫసక్‌ అనేది మోహన్‌బాబు సిగ్నేచర్‌ డైలాగ్‌గా మారిపోయింది. ఏకంగా కొన్ని టీవీ షోలు, సినిమాల్లో కూడా ఈ పదాన్ని రిఫరెన్స్‌గా ఉపయోగించాయి. ఇది మోహన్‌బాబు  నటనా శైలి, హాస్య భావం,  తెలుగు సంస్కృతిలో ఆయన స్థానం ఎంత బలంగా ఉందో చూపించే ఉదాహరణని చెప్పవచ్చు. అయితే, తాజాగా పారడైజ్‌ చిత్రంలో మోహన్‌బాబు లుక్‌ను రివీల్‌ చేయడంతో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. హీరో నానిని డామినేట్‌ చేసేలా మోహన్‌బాబు ఉన్నారంటూ.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement