ప్రభాస్‌ బావ.. అరడజనుమంది పిల్లలతో హ్యాపీగా ఉండు: మోహన్‌బాబు | Mohan Babu’s Funny Birthday Wish to Prabhas Goes Viral – Calls Him “Bava” and Wishes for Marriage Soon | Sakshi
Sakshi News home page

అరడజను మంది పిల్లల్ని కని సంతోషంగా ఉండు.. డార్లింగ్‌కు వెరైటీ బర్త్‌డే విషెస్‌

Oct 23 2025 2:00 PM | Updated on Oct 23 2025 2:39 PM

Mohan Babu Cute Birthday Wishes To Prabhas

కన్నప్ప సినిమాలో ప్రభాస్‌ (Prabhas) నటించడానికి ప్రధాన కారణం మోహన్‌బాబు (Mohan Babu). ఆయన మీదున్న గౌరవంతోనే విష్ణు సినిమాలో నటించేందుకు ముందుకొచ్చాడు. తన లుక్‌తోనే సినిమాకు కావాల్సినంత హైప్‌ తీసుకొచ్చాడు. ప్రభాస్‌ను మోహన్‌బాబు ముద్దుగా బావ అని పిలుస్తుంటాడు. ఈ రోజు (అక్టోబర్‌ 23) డార్లింగ్‌ బర్త్‌డే.. ఈ సందర్భంగా మోహన్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

బావకు బర్త్‌డే విషెస్‌
మై డియర్‌ డార్లింగ్‌ బావా ప్రభాస్‌.. దేశానికే నువ్వు గర్వకారణం. నువ్వు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. అంతులేని సంతోషంతో ఆనందంగా గడపాలి. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి. అలాగే త్వరలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని, అరడజను మంది పిల్లల్ని కని సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు ప్రేమతో, నిన్ను ఎప్పుడూ ప్రేమించే బావ అని ట్వీట్‌ చేశాడు. 

భలే సరదా..
ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రభాస్‌ను అలా ఊహించుకుంటే భలే సరదాగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. ఇంకా పెళ్లి ఊసే లేదంటే.. పిల్లల వరకు వెళ్లిపోయారా.. అని ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్‌, మోహన్‌బాబు.. బుజ్జిగాడు సినిమాలో కలిసి నటించారు. అప్పటినుంచే వీరిద్దరూ ఒకరినొకరు బావ అని పిల్చుకుంటారు.

 

 

చదవండి: బ్లాక్‌బస్టర్‌ మూవీతో బ్రేక్‌.. వస్తున్నా, ఇప్పుడు అసలు సినిమా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement