
సినీ రంగంలో స్టార్ అనే హోదా చాలామందికి వస్తుంది. కానీ ఆ గుర్తింపును కెరీర్ మొత్తం కొనసాగించాలంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇక ఇండస్ట్రీలో మెగాస్టార్ అనిపించుకునే అదృష్టం కొందరికే ఉంటుంది. మన తెలుగు సినీరంగంలో అలాంటి ఘనత సొంతం చేసుకున్న హీరో ఆయనొక్కరే. మన టాలీవుడ్‌లో ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయనే మెగాస్టార్. ఆయనే మన కొణిదెల శివ శంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి.
చిరంజీవి తన కెరీర్ మొదలుపెట్టి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. 22 సెప్టెంబర్ 1978న ప్రాణం ఖరీదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యానని ట్వీట్ చేశారు. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి మీ ముందు మెగాస్టార్‌గా నిలబెట్టిందన్నారు. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానని పోస్ట్ చేశారు.
(ఇది చదవండి: హౌస్‌లో తనే నెం.1, ఇచ్చిపడేసిండు.. ప్రియపై బిగ్‌బాంబ్ వేసిన మనీష్)
చిరంజీవి తన ట్వీట్‌లో రాస్తూ..'22 సెప్టెంబర్ 1978 'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను.. ప్రాణం ఖరీదు.. చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.. మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్‌గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే... అందుకు కారణం నిస్వార్ధమైన మీ ప్రేమే కారణం. ఈ 47 ఏళ్లలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావీ కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ... కృతజ్ఞతలతో మీ చిరంజీవి' అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా.. మెగాస్టార్‌గా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న చిరంజీవి.. ప్రస్తుతం విశ్వంభర, మనశివశంకర వరప్రసాద్ గారు అనే సినిమాలు చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులో తన యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా రాణిస్తున్నారు. ఇవాళ తన తొలి సినిమా పూర్తై 47 ఏళ్లు కావడంతో ఆ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.
22 సెప్టెంబర్ 1978
'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం… pic.twitter.com/1VSVTu9Kkz— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2025