లావణ్యతో పెళ్లి.. అరుదైన ఫోటో షేర్ చేసిన వరుణ్ తేజ్! | Mega Hero Varun Tej Shares First Photo With Lavanya After Wedding | Sakshi
Sakshi News home page

Varun Tej: లావణ్యతో పెళ్లి.. అరుదైన ఫోటో షేర్ చేసిన మెగా హీరో!

Nov 6 2023 6:51 PM | Updated on Nov 6 2023 7:02 PM

Mega Hero Varun Tej Shares First Photo With Lavanya After Wedding - Sakshi

మెగా ఇంట పెళ్లి సందడి ముగిసింది. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్‌ 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో జరిగిన వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ, నితిన్, అల్లు ‍అర్జున్, సన్నిహితులు కూడా హాజరయ్యారు. అక్టోబర్‌ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఇటలీలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే.

పెళ్లి వేడుక తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌లో నవంబర్ 5న రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ ఫంక్షన్‌లో టాలీవుడ్‌ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు.

అయితే లావణ్యతో పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ మొదటి ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. లావణ్య- వరుణ్‌ తేజ్‌ ఉన్న బ్లాక్ అండ్‌ వైట్‌ కలర్‌ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నా అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement