'మెకానిక్‌ రాకీ' 2.O ట్రైలర్‌.. భారీగానే ప్లాన్‌ చేసిన విశ్వక్‌ | Mechanic Rocky 2nd Trailer Out Now | Sakshi
Sakshi News home page

'మెకానిక్‌ రాకీ' 2.O ట్రైలర్‌.. భారీగానే ప్లాన్‌ చేసిన విశ్వక్‌

Nov 19 2024 2:15 PM | Updated on Nov 19 2024 3:21 PM

Mechanic Rocky 2nd Trailer Out Now

'మెకానిక్‌ రాకీ'గా విశ్వక్‌సేన్‌ వస్తున్నాడు. మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించగా రామ్‌ తాళ్లూరి నిర్మాతగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఒక ట్రైలర్‌ విడుదలైంది. దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అయితే, తాజాగా రెండో ట్రైలర్‌ను కూడా మేకర్స్‌ విడుదల చేశారు. వరంగల్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో 'మెకానిక్‌ రాకీ'కి మరింత బజ్‌ క్రియేట్‌ అయింది.

మాస్‌ యాక్షన్, లవ్, సెంటిమెంట్‌ అంశాలతో మెప్పిస్తున్న ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. గతంలో విశ్వక్‌ చెప్పినట్లుగా సినిమా విడుదల సమయంలో మరో ట్రైలర్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. ఆయన అన్నట్లుగానే తాజాగా రిలీజ్‌ చేశారు. నవంబర్‌ 22న ఈ చిత్రం విడుదల కానుండగా ఒక రోజు ముందుగానే పెయిడ్‌ ప్రీమియర్స్‌ వేస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రం కోసం విశ్వక్‌ భారీగానే ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement