వరుణ్ తేజ్ 'మట్కా' ట్రైలర్ రిలీజ్ | Varun Tej's Matka Movie Telugu Trailer Out | Sakshi
Sakshi News home page

Matka Teaser: ఆకట్టుకున్న 'మట్కా' మూవీ ట్రైలర్

Nov 2 2024 12:19 PM | Updated on Nov 2 2024 12:31 PM

Varun Tej's Matka Movie Telugu Trailer Out

'మట్కా' మూవీ ట్రైలర్ రిలీజైంది. చాన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న మెగాహీరో వరుణ్ తేజ్.. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలన్ని పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్లే ట్రైలర్ ఉంది. 'మట్కా' అనే గేమ్ నేపథ్య కథతో దీన్ని తెరకెక్కించారు. మూడు విభిన్న గెటప్స్‌లో వరుణ్ కనిపించాడు. వేరియేషన్స్‌తో ఆకట్టుకున్నాడు.

(ఇదీ చదవండి: పవన్‌తో తొలి సినిమా.. తర్వాత కెరీర్ ఖతం.. ఈ హీరోయిన్ ఎవరంటే?)

నవంబర్ 14న థియేటర్లలోకి 'మట్కా' రానుంది. అదే రోజు సూర్య పాన్ ఇండియా మూవీ 'కంగువ' కూడా థియేటర్లలోకి రానుంది. అయితేనేం ట్రైలర్ చూస్తుంటే వర్కౌట్ అయ్యే బొమ్మలా అనిపిస్తుంది. ట్రైలర్‌లో వరుణ్ తేజ్ చెప్పిన 'నాకు ఇక్కడ (మెదడు).. ఇక్కడ (గుండె)... ఇక్కడ (ఇంకా ఇంకా కిందకు) కంట్రోలు ఉంది కాబట్టే ఇలా వున్నాను' అనే డైలాగ్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. 

(ఇదీ చదవండి: మొదటి పెళ్లిరోజు.. స్పెషల్ వీడియోతో వరుణ్ తేజ్-లావణ్య)

Advertisement
 
Advertisement
Advertisement