ఒక రోజు ముందుగానే ఓటీటీకి రవితేజ ఈగల్..స్ట్రీమింగ్ ఎక్కడంటే! | Mass Maharaja Ravi Teja Eagle Movie Expected OTT Release Date Goes Viral, Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Eagle Movie OTT Release: ఓటీటీకి రవితేజ ఈగల్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Thu, Feb 29 2024 7:57 AM

Mass Maharaja Ravi Teja Eagle Movie Streaming On This Date Goes Viral - Sakshi

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్  ఈగల్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. ఈ  చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ అందుకుంది. అయినప్పటికీ రవితేజ మాస్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. కేవలం రూ.35 కోట్లకు పైగా వసూళ్లను మాత్రమే సాధించింది.ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‍గా నటించగా.. అనుపమ పరమేశ్వరన్ కీలకపాత్ర పోషించారు. 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ మూవీ మార్చి 1 నుంచే స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్‌ ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అయితే ముందుగా ఈ సినిమా మార్చి 2వ తేదీ నుంచి ఓటీటీకి రానున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పటికే ఈ మూవీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన అయితే ఈగల్‌ థియేటర్లో రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీకి వచ్చేస్తోంది. 

కాగా.. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా కావ్య థాపర్ నటించగా.. జర్నలిస్టు పాత్రలో అనుపమ పరమేశ్వరన్ చేశారు. నవ్‍దీప్ కూడా ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధూ, శ్రీనివాస రెడ్డి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించారు.  

Advertisement
Advertisement