breaking news
Mass maharaj
-
'ఇరుముడి' సెట్లో రవితేజ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
ఉంచాలా తీసేయాలా.. ఫస్ట్ నన్ను అడగాలి
కెరీర్లో తొలిసారి రవితేజ.. తన 'మాస్ మహారాజ' అనే ట్యాగ్ తీసేసి, రెమ్యునరేషన్ అందుకోకుండా చేసిన సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఈ మంగళవారం(జనవరి 13) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు హరీశ్ శంకర్.. రవితేజ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత సినిమాతో అలరించలేకపోయాం. ఈసారి కచ్చితంగా బ్లాక్ బస్టర్ తీస్తా అని మాటిచ్చారు.'ఈ సినిమాకు రవితేజ అన్నయ్య.. మాస్ మహారాజ్ టైటిల్ తీసేయండి అని అన్నారట. ఆ టైటిల్ పెట్టింది నేను. దాన్ని పేటెంట్ రైట్స్ నా దగ్గరే ఉన్నాయి. అది ఉంచాలన్నీ తీసేయాలన్నా ఫస్ట్ నన్ను అడగాలి. మాస్ మహారాజ్ అనే పేరు ఉంచాలా తీసేయాలా అనేది అన్నయ్య ఇష్టం. కానీ మమ్మల్ని ఆపడం మాత్రం మీకు చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి. అది జరిగే పనికాదు. మిరాపకాయ్ వచ్చినా మిస్టర్ బచ్చన్ వచ్చినా ఒకేలా ఉండే వ్యక్తి మాస్ మహారాజ్ రవితేజ. ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్‌నే 'నేనింతే'లో పూరీ జగన్నాథ్ పెట్టారు'(ఇదీ చదవండి: 'చిరంజీవి' సినిమాకు రివ్యూలు, రేటింగ్స్ బంద్.. కోర్టు ఆర్డర్)'సినిమా ఎలా ఉన్నాసరే ఆడిందా ఊడిందా అనేది రవితేజ ఏం పట్టించుకోడు. తర్వాత రోజు షూటింగ్‌కి వెళ్లిపోతాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.. బ్లాక్ బస్టర్స్ వచ్చినప్పుడు పొంగిపోకురా, ఫ్లాపులు వచ్చినప్పుడు కుంగిపోకురా' అని అర్థం. ఆయన పరిచయం చేసిన దర్శకులు బోయపాటి శ్రీను, శ్రీనువైట్ల, గోపీచంద్ మలినేని, బాబీ.. ఈరోజు స్టార్ డైరెక్టర్స్ పొజిషన్లో ఉన్నారు. మా గత సినిమా సరిగా ఎంటర్టైన్ చేయలేదు. డిసప్పాయింట్ చేశాం. కానీ మేం అక్కడితో అలా ఆగిపోము. రవితేజతో మళ్లీ బ్లాక్‌బస్టర్ తీస్తా' అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చాడు.హరీశ్ శంకర్ కెరీర్ చూసుకుంటే.. ఇరవైళ్లలో ఎనిమిది సినిమాలు తీశాడు. వీటిలో మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం, సుబ్రమణ్యం ఫర్ సేల్ హిట్ అయ్యాయి. చివరగా 2024లో 'మిస్టర్ బచ్చన్' అనే రీమేక్ మూవీ చేశాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' చేస్తున్నాడు. ఇది దళపతి విజయ్ 'తెరి' రీమేక్ అనే ప్రచారం చాన్నాళ్లుగా జరుగుతోంది. దీని వల్ల మూవీపై అస్సలు బజ్ లేదు. ఈసారి హిట్ కొడితేనే హరీశ్ శంకర్‌కి ప్లస్ అవుతుంది. మరెం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఏపీలో రవితేజ, నవీన్ సినిమాలకు టికెట్ ధరలు పెంపు) -
క్లాస్ డైరెక్టర్ తో జోడి కడుతున్న మాస్ మహారాజ్
-
మాస్ మహారాజా మిస్టర్ బచ్చన్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్'. ఈ చిత్రాన్ని హరీశ్ శంకర్ డైరెక్షన్లో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.మిస్టర్ బచ్చన్ ట్రైలర్‌ను ఈ నెల 7వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని రవితేజ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ మేరకు రవితేజ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సితార్ సాంగ్ అత్యధిక వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. కాగా.. ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. #MrBachchan MASS MAHA TRAILER on August 7th 🔥 pic.twitter.com/pcq8kv0pVm— Ravi Teja (@RaviTeja_offl) August 5, 2024 -
'మిస్టర్ బచ్చన్.. 'రెప్పల్ డప్పుల్ ' స్పీకర్లను బ్లాస్ట్ చేసే సాంగ్
-
ఒక రోజు ముందుగానే ఓటీటీకి రవితేజ ఈగల్..స్ట్రీమింగ్ ఎక్కడంటే!
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఈగల్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ అందుకుంది. అయినప్పటికీ రవితేజ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. కేవలం రూ.35 కోట్లకు పైగా వసూళ్లను మాత్రమే సాధించింది.ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్గా నటించగా.. అనుపమ పరమేశ్వరన్ కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ మార్చి 1 నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అయితే ముందుగా ఈ సినిమా మార్చి 2వ తేదీ నుంచి ఓటీటీకి రానున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పటికే ఈ మూవీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన అయితే ఈగల్ థియేటర్లో రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీకి వచ్చేస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా కావ్య థాపర్ నటించగా.. జర్నలిస్టు పాత్రలో అనుపమ పరమేశ్వరన్ చేశారు. నవ్‌దీప్ కూడా ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధూ, శ్రీనివాస రెడ్డి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
మరో ఊర మాస్ కాంబినేషన్ స్టోరీ కూడా లీక్?
-
మాస్ మహరాజ ఎప్పుడు మొదలెడతాడో..?
మాస్ మహరాజ రవితేజ హీరోగా తెరకెక్కిన బెంగాల్ టైగర్ విడుదలై చాలాకాలమే అవుతోంది.ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే రాబిన్ హుడ్ సినిమాను ప్రకటించిన రవితేజ, ఇంతవరకు ఆ సినిమాను స్టార్ట్ చేయలేదు. బెంగాల్ టైగర్ డీసెంట్ కలెక్షన్లతో హిట్ టాక్ తెచ్చుకున్నా.. రవితేజ నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కొంతకాలంగా భారీ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న రవితేజ, తన రేంజ్ మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఓ పక్కా మాస్ కథతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన రవితేజ, జూలైలోనే ఈ సినిమాను ప్రారంభించాలని భావించాడు. అయితే కథా కథనాల విషయంలో ఇంకా పూర్తి నమ్మకం రాకపోవటంతో ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉంది ఈ సినిమా. తను చేయబోయే నెక్ట్స్ సినిమా రాబిన్ హుడ్ అంటూ క్లారిటీ ఇచ్చిన రవితేజ, ఆ సినిమాను ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్లేది మాత్రం చెప్పలేకపోతున్నాడు.


