
‘‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రం ఔట్ అండ్ ఔట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. వైజాగ్, విజయవాడ, వరంగల్ వంటి చోట్ల మా సినిమా ప్రివ్యూస్ వేశాం. అన్ని వర్గాల ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. వారి మాటలతో సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం’’ అని హీరో మనోజ్ చంద్ర తెలిపారు. మనోజ్ చంద్ర, మోనిక జోడీగా నటించిన చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. ప్రవీణ పరుచూరి దర్శకత్వంలో రానా దగ్గుబాటి సమర్పణలో గోపాలకృష్ణ పరుచూరి–ప్రవీణ పరుచూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా మనోజ్ చంద్ర మాట్లాడుతూ– ‘‘నేను అమెరికాలో ఉన్నప్పుడు ప్రవీణగారితో పరిచయమైంది. ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’లో హీరోపాత్ర పేరు రామకృష్ణ. ఆపాత్రకి సరిపోయే నటుడి కోసం వెతుకుతున్నానంటూ స్క్రిప్ట్ చదవమని ఇచ్చారామె. ఆ కథ నాకు నచ్చడంతో నేను చేస్తానంటూ ఆడిషన్స్ ఇచ్చాను. ఆపాత్రకి నేను న్యాయం చేయగలనని ఆమెకు నమ్మకం కుదరడంతో ఈ సినిమా అచేసే అవకాశం నాకు దక్కింది.
ఇది ఒక ఊరి కథ. ఈ చిత్రంలో రామకృష్ణకి సావిత్రి అనే అమ్మాయి అంటే ఇష్టం. ఒకరోజు సావిత్రిని కలవడానికి ఒక గడ్డి వాము దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఆసక్తిగా ఉంటుంది. హీరోగా నా తొలి సినిమా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ విడుదల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పారు.