ఆ స్టార్స్ అవకాశాలు ఇవ్వట్లేదు.. మణిశర్మ ఆవేదన ఎంతవరకు కరెక్ట్? | Sakshi
Sakshi News home page

Mani Sharma: ఆ హీరోలు పట్టించుకోవట్లేదు.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

Published Wed, Jan 3 2024 12:06 PM

Mani Sharma Comments On Pawan And Mahesh Movie Chances - Sakshi

మణిశర్మ.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. మహేశ్ దగ్గర నుంచి పవన్, చిరంజీవి.. ఇలా దాదాపు అందరు స్టార్ హీరోలకు వాళ్ల కెరీర్‌లో గుర్తుండిపోయే సాంగ్స్ ఇచ్చారు. అలాంటి ఈయన ఇప్పుడు చోటామోటా హీరోల సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిశర్మ.. తనకు స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: వేణుస్వామి నటించిన రెండు తెలుగు సినిమాలు... అవేంటో తెలుసా?)

మణిశర్మ ఏమన్నారు?
ఇప్పుడు ఏ విషయంలోనైనా హర్ట్ అవుతున్నారా? అని యాంకర్ అడిగాడు. దీనికి బదులిచ్చిన మణిశర్మ.. 'హర్ట్ అయ్యేందుకు కారణం ఉందంటే.. మహేశ్, పవన్ కల్యాణ్ లాంటి హీరోలు అందరికీ ఒక్కో ఛాన్స్ ఇవ్వొచ్చు. అలా అన్ని నాకే ఇచ్చేయాలని అనట్లేదు. ఒక్కొక్కరికి తలో ఛాన్స్ ఇస్తే జనాలకు కూడా వెరైటీగా ఉంటుంది. దేవీకి ఓ సినిమా.. నాకో సినిమా.. తమన్‌కి ఓ సినిమా.. పోనీ వాళ్లకు రెండు ఇచ్చి నాకు ఒకటే ఇవ్వండి. అలా పంచితే అందరికీ వెరైటీగా ఉంటుంది. ఇది నా వరకు నేను అనుకునేది. నేను వెళ్లి వాళ్లతో చెప్పలేదు. ఎవరితో చెప్పలేను' అని  మణిశర్మ తన మనసులోని బాధని బయటపెట్టారు.

ఆవేదన కరెక్టేనా?
1998 నుంచి 2010 వరకు మంచి ఫామ్‌లో ఉన్న మణిశర్మ.. ఆ తర్వాత పాటల పరంగా ఎందుకో వెనకబడిపోయారు.  అదే టైంలో దేవీశ్రీ ప్రసాద్, తమన్ లాంటి వాళ్లు ముందుకు దూసుకొచ్చారు. మధ్యలో 'ఇస్మార్ట్ శంకర్'తో మణిశర్మ.. ఊపు ఊపునప్పటికీ జోష్ సరిపోలేదు. అలానే ట్రెండ్ తగ్గ పాటలు చేయడంలో మణిశర్మ కాస్త వెనకబడటం కూడా స్టార్ హీరోలు ఈయన ఛాన్సులు ఇవ్వకపోవడానికి కారణమై ఉండొచ్చు. ఈయన బాధపడటంలో తప్పు లేదు కానీ అంతమాత్రన మహేశ్, పవన్ లాంటి హీరోలు మణిశర్మకు పిలిచి ఛాన్స్‌లు ఇస్తారా అంటే డౌటే.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?)

 
Advertisement
 
Advertisement