ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్? | Sakshi
Sakshi News home page

Animal OTT: ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'యానిమల్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?

Published Wed, Jan 3 2024 7:03 AM

Animal Movie OTT Release Date January 15th 2024  - Sakshi

ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమా చాలా అంటే చాలా మాట్లాడుకున్నారా అంటే అందరికీ గుర్తొచ్చేది 'యానిమల్'. థియేటర్లలోకి వచ్చేంతవరకు ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. కానీ ఒక్కసారి బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేసిన తర్వాత ఆడియెన్స్‌కి ఎందుకో తెగ నచ్చేసింది. ఇప్పటికీ చాలాచోట్ల ఇంకా స్క్రీనింగ్ అవుతోంది. ఇలాంటి టైంలో ఓటీటీ న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

సందీప్ రెడ్డి వంగా పేరు చెప్పగానే 'అర్జున్ రెడ్డి' గుర్తొస్తుంది. ఈ సినిమాతో ట్రెండ్ సృష్టించాడు. ఇ‍ప్పుడు 'యానిమల్'తో దీన్ని మించిపోయేలా చేశాడు. తీసింది బాలీవుడ్ హీరోతోనే అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని చాలా ఓన్ చేసుకున్నారు. ఈ క్రమంలో మూవీ గురించి ఇప్పటికీ తెగ మాట్లాడుకుంటున్నారు. సీన్స్, సాంగ్స్, ఇందులోని యాక్టర్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు)

ఇకపోతే డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన 'యానిమల్' సినిమా డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. లెక్క ప్రకారం అయితే జనవరి 26న స్ట్రీమింగ్ చేస్తారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆలోచన మారినట్లు కనిపిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 15నే ఓటీటీలోకి తీసుకొచ్చేయాలని అనుకున్నారట. ఈ తేదీ ఫిక్స్ అని, కాకపోతే అధికారిక ప్రకటన రావాల్సి ఉందని అంటున్నారు. 

ఒకవేళ సంక్రాంతికి వస్తే మాత్రం 'యానిమల్'కి ప్లస్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. థియేటర్లలో కొత్త సినిమాలకు వెళ్లే ఇంట్రెస్ట్ లేని వాళ్లు.. ఈ బ్లాక్‌బస్టర్‌పై లుక్కేసే అవకాశముంటుంది. అయితే ఈ సినిమా ఓటీటీ వెర్షన్.. థియేటర్ కంటే కాస్త పెద్దగానే ఉంటుందని సమాచారం. ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే.. కొన్నిరోజులు ఆగితే సరి.

(ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!)

Advertisement
 
Advertisement