
ఇప్పటివరకూ తమన్నా చేసినపాత్రలన్నీ ఒక ఎత్తు... ఇప్పుడు చేయనున్నపాత్ర మరో ఎత్తు అనేలా ఆమె ఓ క్యారెక్టర్ ఒప్పుకున్నారట. ‘రాగిణి ఎంఎంఎస్ 2’ (2014) చూసినవాళ్లకు ఆ చిత్రంలో రాగిణిపాత్రలో సన్నీ లియోన్ ఎంత బోల్డ్‌గా రెచ్చిపోయారో తెలుసు కదా... తమన్నా కూడా రాగిణిలా కనిపించనున్నారట. ‘రాగిణి ఎంఎంఎస్ 3’ రూపొందించడానికి నిర్మాత ఏక్తా కపూర్ సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్ టాక్. ఈ హారర్ థ్రిల్లర్ కామెడీ మూవీలో కథానాయికగా నటించాలంటూ తమన్నాని సంప్రదించారట ఏక్తా. తమన్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
ఈ వార్త నిజమైతే ఇప్పటివరకూ కనిపించనంత హాట్‌గా తమన్నా కనిపిస్తారని ఊహించవచ్చు. ఇక ‘రాగిణి ఎంఎంఎస్’ తొలి భాగానికి పవన్ క్రిపలానీ, మలి భాగానికి వినయ్ ఎనగుండ్ల దర్శకత్వం వహించగా మూడో భాగానికి ఏక్తా ఇంకా దర్శకుణ్ణి ఖరారు చేయలేదని సమాచారం. ఈ చిత్రం గురించిన వార్త ప్రచారంలోకి రావడంతో తొలి భాగంలో కైనాజ్ మోతీవాలా, మలి భాగంలో సన్నీ లియోన్ నటించినంత బోల్డ్‌గా తమన్నా నటిస్తుందా? వాళ్లు కనిపించినంత హాట్‌గా కనిపిస్తుందా? అనే చర్చ మొదలైంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని ఆరంభించాలనుకుంటున్నారట. త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం.