ఓటీటీలో మలయాళ ఫాంటసీ కామెడీ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌ | Malayalam Movie Padakkalam Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

ఓటీటీలో మలయాళ ఫాంటసీ కామెడీ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌

Jun 10 2025 7:40 AM | Updated on Jun 10 2025 9:24 AM

Malayalam Movie Padakkalam Movie OTT Streaming Now

మలయాళంలో తెరకెక్కిన ఒక ఫాంటసీ కామెడీ చిత్రం 'పడక్కలం'.. మే 9న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్‌ అవుతుంది. నూతన దర్శకుడు మను స్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూరజ్ వెంజరమూడు, షరాఫుద్దీన్, సందీప్ ప్రదీప్ నటించారు. ప్రేక్షకులకు క్లీన్ క్యాంపస్ సూపర్ నేచురల్ ఫాంటసీ కామెడీని  దర్శకుడు అందించాడు. కానీ,  పేలవమైన కథ ఎంపిక చేసుకోవడం వల్ల సినిమాను నిరాశపరిచింది.

జూన్‌ 10న పడక్కలం జియోహాట్‌స్టార్‌ వేదికగా విడుదలైంది.  మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 18 కోట్లు రాబట్టింది. కామెడీ పరంగా సినిమా పర్వాలేదనిపించినా... కథ ఎంపిక విషయంలో దర్శకుడు తడబడ్డాడని చెప్పవచ్చు. అయితే, ఓటీటీలో ప్రేక్షకులను మెప్పించే ఛాన్స్‌ ఉంది.

నలుగురు కాలేజీ అబ్బాయిల ప్రయాణమే  పడక్కలం చిత్రం. వారికి కామిక్ పుస్తకాలు అంటే చాలా ఇష్టం. వారు ఊహించని సాహసయాత్రలో పాల్గొంటారు, వారి పాఠశాలలోని ఒక ప్రొఫెసర్‌కు ఉన్న అతీంద్రియ శక్తులతో వారి విద్యా ప్రపంచం తలకిందులు అవుతుంది. అనేక మలుపులతో వారి ప్రయాణం ఎలా ముగుస్తుంది అనేది ఈ చిత్రం.

Advertisement
 
Advertisement
Advertisement