పేకాట ఆడిన‌ స్టార్ హీరోలు, ఫోటోలు వైర‌ల్‌ | Mahesh Babu, Venkatesh Seen Playing Poker at Gathering, Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Mahesh Babu, Venkatesh: పేకాట ఆడుతూ చిల్ అయిన చిన్నోడు, పెద్దోడు..

Nov 5 2023 4:55 PM | Updated on Nov 5 2023 5:30 PM

Mahesh Babu, Venkatesh Seen Playing Poker at Gathering, Photos Goes Viral - Sakshi

తాజాగా ఈ ఆన్‌స్క్రీన్ బ‌ద‌ర్స్ పేకాట ఆడుతూ క‌నిపించారు. మా హీరో పేకాట కూడా ఆడ‌తాడా? అని షాక్ అవుతుంటే మ‌రికొంద‌రు.. మీరు కూడా ఇలా పేకాట‌తో చిల్ అవుతారా? అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. వీరి సినిమాల విష‌యాని

టాలీవుడ్‌ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు, స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేశ్‌.. వీరిద్ద‌రూ సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు అనే మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో క‌లిసి న‌టించారు. ఈ మూవీలో వెంకీ మామ.. పెద్దోడిగా, మ‌హేశ్‌.. చిన్నోడిగా న‌టించి చాలా ఫేమ‌స్ అయ్యారు. వీరు క‌లిసి క‌నిపిస్తే చాలు చిన్నోడు, పెద్దోడు ఒకేచోట ఉన్నారే అని కామెంట్లు వినిపిస్తుంటాయి. తాజాగా ఈ ఆన్‌స్క్రీన్ బ‌ద‌ర్స్ పేకాట ఆడుతూ క‌నిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 

ఈ ఫోటోల్లో వీరిద్ద‌రూ ఒకే టేబుల్ ద‌గ్గ‌ర ప‌క్క‌ప‌క్క‌న కూర్చుని పేకాట ఆడుతూ చిల్ అయ్యారు. అయితే ఓ ప్ర‌ముఖ క్ల‌బ్ హౌస్ ఓపెనింగ్‌కు వెళ్లిన సంద‌ర్భంలోనే ఇలా వీరు పేకాట ఆడిన‌ట్లు తెలుస్తోంది. ఇది చూసిన అభిమానులు కొంద‌రు మా హీరో పేకాట కూడా ఆడ‌తాడా? అని షాక్ అవుతుంటే.. మ‌రికొంద‌రు మీరు కూడా ఇలా పేకాట‌తో చిల్ అవుతారా? అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. వీరి సినిమాల విష‌యానికి వ‌స్తే మ‌హేశ్‌బాబు ప్ర‌స్తుతం గుంటూరు కారం సినిమాలో న‌టిస్తుండ‌గా వెంక‌టేశ్ సైంధ‌వ్ సినిమా చేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement