మహేశ్‌ -రాజమౌళి సినిమా కథేంటో చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్‌ | Sakshi
Sakshi News home page

మహేశ్‌ -రాజమౌళి సినిమా కథేంటో చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్‌

Published Tue, Jan 23 2024 8:06 AM

Mahesh Babu And Rajamouli Movie Story Reveal - Sakshi

RRR సినిమా తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా తీస్తారని అని అందరూ ఆలోచిస్తున్న సమయంలో  మహేశ్‌ బాబుతో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. కానీ ఆ సినిమాకు సంబంధించిన పలు వార్తలు నెట్టంట వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమాతో మహేశ్‌ బాబు పాన్‌ ఇండియా రేంజ్‌లో అడుగుపెడుతున్నాడు. దీంతో ఆయన ఫ్యాన్స్‌ కూడా వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ పూర్తి అయిందని ప్రకటించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో SSMB29 ప్రాజెక్ట్‌పై పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. మహేశ్‌- రాజమౌళి సినిమా 'ఇండియానా జోన్స్‌'లా ఉంటుందని క్లారటీ ఇచ్చేశారు. కానీ ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా టైటిల్‌ ఫైనల్‌ చేయలేదని చెప్పారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ ఎక్కువగా అడవి నేపథ్యంలోనే సాగుతుందని పేర్కొన్నారు. అలాగని ఇది పీరియాడికల్‌ మూవీ కాదని ముందే చెప్పాశారు. ఈ సినిమా సంగీతం గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు. ఈ సినిమాతో మహేశ్‌ బాబు ఇమేజ్‌ భారీగా పెరుగుతుందని పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ ఒక్క సినిమాతోనే గుర్తింపురావాలని తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

'ఇండియానా జోన్స్‌' గురించి తెలుసా..?
యాక్షన్‌, అడ్వెంచర్‌ సినిమాలను ఇష్టపడేవారందరికీ 'ఇండియానా జోన్స్‌' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాల ద్వారా సుమారు 15 వేల కోట్ల రూపాయాలు కలెక్షన్స్‌ వచ్చాయి.  1981లో 'రైడర్స్‌ ఆఫ్‌ ది లాస్ట్‌ ఆర్క్‌'తో మొదలైన ఈ ఫ్రాంఛైజీలో మొత్తం నాలుగు చిత్రాలు వచ్చాయి. ఈ సిరీస్‌లో ఆఖరి సినిమా కూడా 2023లో విడుదలైంది. 'ఇండియానా జోన్స్‌ అండ్‌ ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ'తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. 'ఇండియానా జోన్స్‌' అన్ని సిరీస్‌లకు చిత్రాలకు హాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ దర్శకత్వం వహించారు. రాజమౌళికి ఇష్టమైన డైరెక్టర్‌ కూడా స్పీల్‌బర్గ్‌ అని తెలిసిందే.

Advertisement
 
Advertisement