కొడుకు కోసం తండ్రి పడే ఆరాటమే ‘లైఫ్‌’ | 'LYF: Love Your Father' Movie Latest Update | Sakshi
Sakshi News home page

కొడుకు కోసం తండ్రి పడే ఆరాటమే ‘లైఫ్‌’

Sep 24 2024 6:10 PM | Updated on Sep 24 2024 6:19 PM

'LYF: Love Your Father' Movie Latest Update

 శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటించిన సినిమా  లైఫ్ (లవ్ యువర్ ఫాదర్). పవన్ కేతరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఏ. రామస్వామి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తయింది. అతి త్వరలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ టీం మీడియాతో ముచ్చటించారు.

దర్శకుడు పవన్ కేతరాజు మాట్లాడుతూ : కొడుకు బాధ్యత తీర్చేందుకు తండ్రి పడే ఆరాటం తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం మా ఈ లైఫ్ సినిమా. కథ అంతా కాశి బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ శివతత్వాన్ని చూపించే చిన్న ప్రయత్నం చేశామన్నారు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటరటైనర్ సినిమాగా ఈ సినిమాని తీస్తున్నాం ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను’ అన్నారు.

 హీరో శ్రీహర్ష మాట్లాడుతూ : లైఫ్... తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చూపించే ఒక మంచి సినిమా. ఈరోజు ఈ సినిమా షూటింగ్ లాస్ట్ డే. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

‘సినిమా ఎక్కువ శాతం కాశీలో షూట్ చేసాం. దైవత్వంతో పాటు తండ్రి కొడుకులు మధ్య ఉన్న బంధాన్ని కూడా చాలా బాగా చూపిస్తున్నాం’ అని నిర్మాత అన్నపరెడ్డి రామస్వామి రెడ్డి అన్నారు. 
‘డైరెక్టర్ పవన్ చెప్పిన కథ చాలా బాగుంది. తండ్రికి కొడుకు కి మధ్యన అనుబంధాన్ని చాలా బాగా చూపిస్తున్నారు. ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను’ అని హీరోయిన్‌ కషిక కపూర్‌ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement