LYF Movie
-
లైఫ్ మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్
ఈ వీకెండ్ లో థియేటర్లలో రిలీజైన లవ్ యూవర్ ఫాదర్ సినిమా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో తండ్రి-కొడుకుల అనుబంధాన్ని భావోద్వేగభరితంగా చిత్రీకరించారు. ఎస్పీ చరణ్, శ్రీ హర్ష, కషిక కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని పవన్ కేతరాజు దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: చేదు అనుభవం.. శ్రీలీలని పట్టి లాగేశారు)ఈ సినిమా సక్సెస్ కావడంతో మూవీ టీమ్ అంతా కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. చిత్రాన్ని ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్ పవన్ కేతరాజు మాట్లాడుతూ.. చాలామంది ఫోన్లు చేసి ఈ సినిమా చూసిన తర్వాత తండ్రి గుర్తొస్తున్నారని చెబుతున్నారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ అదిరిపోయిందని అంటున్నారు. నిజంగా ఈ సినిమాకి ఇంతలా కనెక్ట్ అయినందుకు హ్యాపీగా ఉందని చెప్పారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా) -
లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా రివ్యూ
దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ చాన్నాళ్ల తర్వాత నటుడిగా చేసిన సినిమా 'లైఫ్' (లవ్ యువర్ ఫాదర్). కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి సంయక్తంగా నిర్మించారు. పవన్ కేతరాజు దర్శకుడు. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటించారు. తాజాగా ఏప్రిల్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?కథేంటి?కిశోర్(ఎస్పీ చరణ్), సిద్ధూ (శ్రీ హర్ష) తండ్రీ కొడుకులు. అనాథలకు ఆపదొస్తే సాయం చేయడంలో మిగతావారి కంటే మందుంటారు. అనాథ శవాలకు సొంత డబ్బుతో కిశోర్ దహన సంస్కారాలు జరిపిస్తుంటాడు. ఇందుకు అవసరమైన డబ్బు కోసం గుర్రపు పందెలు కాస్తుంటాడు. ప్రతిసారి ఇతడే బెట్ నెగ్గుతుంటాడు. అయితే కిశోర్ చేసే అనాథ శవాల దహన సంస్కారాల వెనుక పెద్ద స్కామ్ ఉందని వార్తలొస్తాయి. దీని వెనుక బడా బిజినెస్ మ్యాన్ కబీర్ (నవాబ్ షా) ఉంటాడు. కిషోర్, సిద్ధూను ఇతడు ఎందుకు టార్గెట్ చేశాడు? తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో మైథాలజికల్ అంశాలు చూపిస్తున్నారు. 'లవ్ యువర్ ఫాదర్' కూడా ఆ లిస్టులోకి వచ్చే సినిమా. కథలో ఇదే మేజర్ పార్ట్. దాన్ని డామినేట్ చేసేలా ఎక్కువ స్క్రీన్ టైమ్ కాలేజీ ఎపిసోడ్ తీసుకోవడంతో ఇంటర్వెల్ ముందు అసలు కథలో కీలకమైన ఘట్టం మొదలు అవుతుంది. సెకండాఫ్ కూడా ఫాంటసీ పాయింట్ స్టార్ట్ అయ్యాక వచ్చే కామెడీ సీన్స్ ఫ్లోని కొంత డైవర్ట్ చేసినా నవ్విస్తాయి. క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. రెగ్యులర్ అన్పించే కామెడీ సీన్స్, కాలేజీ ఎపిసోడ్స్ తర్వాత వచ్చే డివోషనల్ సీన్స్ హై ఇస్తాయి. మధ్య మధ్యలో కొంత ల్యాగ్ ఉన్నా అందర్నీ మెప్పించే డివోషనల్ పాయింట్ కోసం పర్లేదు. కథలో కీలకమైన రివేంజ్ ఎపిసోడ్ ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది. కథలో బలవంతంగా ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది.మణిశర్మ సంగీతమందించిన శివుని నేపథ్యంలో పాట, నేపథ్య సంగీతం బాగున్నాయి. కెమెరా వర్క్, నిర్మాణ విలువలు స్థాయికి తగ్గటున్నాయి. డైలాగ్స్ మీద వర్క్ సరిగా చేయలేదు. కామెడీపై కేర్ తీసుకుంటే సినిమా ఇంకా బాగా వచ్చేది.తండ్రిగా ఎస్పీ చరణ్ నటన బాగుంది. హీరోగా ఫస్ట్ సినిమాకు శ్రీహర్ష డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హీరోయిన్ కషికా కపూర్ ఓకే. మిగతా పాత్రధారులు న్యాయం చేశారు. కొంత ల్యాగ్, రొటీన్ సీన్స్ ఉన్నా డివోషనల్ పాయింట్, క్లైమాక్స్ ట్విస్ట్ పర్లేదనిపించేలా ఉన్నాయి. -
ట్రైలర్ చాలా బాగుంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
శ్రీహర్ష, కషికా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘ఎల్.వై.ఎఫ్’ (లవ్ యువర్ ఫాదర్). దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ ప్రధాన పాత్ర పోషించారు. పవన్ కేతరాజు దర్శకత్వం వహించారు. కిశోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఎ. రామస్వామి రెడ్డి, ఎ. చేతన్ సాయిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని వీక్షించి, తొలి టిక్కెట్‌ని కొనుగోలు చేసిన అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఎల్.వై.ఎఫ్’ ట్రైలర్ చాలా బాగుంది. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వారణాసిలోని కాశీ విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
తక్కువ బడ్జెట్లో మంచి చిత్రాలు తీయాలి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
‘‘ఎక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసి, ఆ తర్వాత టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని అడగడం కంటే.. తక్కువ బడ్జెట్లోనే మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం మంచిది. అలా తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్‌తో వస్తున్న ‘ఎల్.వై.ఎఫ్’ వంటి చిత్రాలను ప్రోత్సహించడంలో నేను ముందుంటాను’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.శ్రీహర్ష, కషికా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎల్.వై.ఎఫ్’ (లవ్ యువర్ ఫాదర్). పవన్ కేతరాజు దర్శకత్వం వహిస్తున్నారు. మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్లపై కిశోర్ రాటి, మహేష్ రాటి, ఎ. రామస్వామి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని కోమటిరెడ్డి వెంకట రెడ్డి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఎక్కువ బడ్జెట్లో కాకుండా మంచి కంటెంట్‌తో తక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాలు బాగుంటాయి. ఇలాంటి చిత్రాలే మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ‘ఎల్.వై.ఎఫ్’ కూడా అదే విధంగా విజయం సాధించాలి’’ అన్నారు. ఎస్పీ చరణ్, ప్రవీణ్, భద్రం, నవాబ్ షా, ‘షకలక’ శంకర్, రవిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: మణిశర్మ. -
కొడుకు కోసం తండ్రి పడే ఆరాటమే ‘లైఫ్’
శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటించిన సినిమా లైఫ్ (లవ్ యువర్ ఫాదర్). పవన్ కేతరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఏ. రామస్వామి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తయింది. అతి త్వరలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ టీం మీడియాతో ముచ్చటించారు.దర్శకుడు పవన్ కేతరాజు మాట్లాడుతూ : కొడుకు బాధ్యత తీర్చేందుకు తండ్రి పడే ఆరాటం తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం మా ఈ లైఫ్ సినిమా. కథ అంతా కాశి బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ శివతత్వాన్ని చూపించే చిన్న ప్రయత్నం చేశామన్నారు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటరటైనర్ సినిమాగా ఈ సినిమాని తీస్తున్నాం ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను’ అన్నారు. హీరో శ్రీహర్ష మాట్లాడుతూ : లైఫ్... తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చూపించే ఒక మంచి సినిమా. ఈరోజు ఈ సినిమా షూటింగ్ లాస్ట్ డే. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.‘సినిమా ఎక్కువ శాతం కాశీలో షూట్ చేసాం. దైవత్వంతో పాటు తండ్రి కొడుకులు మధ్య ఉన్న బంధాన్ని కూడా చాలా బాగా చూపిస్తున్నాం’ అని నిర్మాత అన్నపరెడ్డి రామస్వామి రెడ్డి అన్నారు. ‘డైరెక్టర్ పవన్ చెప్పిన కథ చాలా బాగుంది. తండ్రికి కొడుకు కి మధ్యన అనుబంధాన్ని చాలా బాగా చూపిస్తున్నారు. ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను’ అని హీరోయిన్ కషిక కపూర్ అన్నారు.