ఇండియన్‌-2 డిజాస్టర్‌.. పార్ట్‌-3పై ఊహించని సర్‌ప్రైజ్..! | Lyca Productions Announced Kamal Haasan Indian 3 Movie | Sakshi
Sakshi News home page

Indian 3 Movie: ఇండియన్‌-2 డిజాస్టర్‌.. పార్ట్‌-3పై ఊహించని నిర్ణయం..!

Oct 8 2026 3:30 PM | Updated on Oct 8 2026 3:51 PM

Lyca Productions Announced Kamal Haasan Indian 3 Movie

దాదాపు 30 ఏళ్ల క్రితం కమల్ హాసన్ నటించిన సూపర్ హిట్ మూవీ భారతీయుడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో కమల్ ద్విపాత్రాభినయంతో అభిమానులను మెప్పించాడు. ఆ తర్వాత ఈ మూవీకి సీక్వెల్‌గా ఇండియన్‌-2 తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో మరో పార్ట్ ఉండదని అంతా భావించారు.

కానీ ఊహించని విధంగా ఈ మూవీకి పార్ట్-3 కూడా రానుందని ప్రకటించారు. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా వెల్లడించారు. సేనాపతి బ్యాక్‌.. ఇండియన్-3 వార్ మోడ్  రానుందని పోస్టర్‌ పంచుకున్నారు. గుర్రాలపై ముగ్గురు వెళ్తున్న ఈ పోస్టర్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పిక్ చూస్తుంటే కమల్ త్రిపాత్రాభినయం ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇండియన్‌-2 నటించిన కాజల్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌, ఎస్‌.జె.సూర్య ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించనున్నారు. ఈ చిత్రానికి సైతం శంకర్ దర్శకత్వం వహించనున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement